Acharya : తెలుగు ఇండస్ట్రీ ఎప్పటికీ మరిచిపోని నటుడు, తెలుగు సినిమా చరిత్రలో మిగిలిపోయే నటుడు ఎవరైనా ఉన్నారంటే అది మెగాస్టార్ చిరంజీవి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక ట్రెండ్ సెట్ చేశారు.
ఒక డ్యాన్స్, ఒక ఫైట్.. ఒక సెంటిమెంట్.. ఒక మాస్ లుక్.. ఇలా.. తెలుగు సినిమా ప్రేక్షకులకు వీటిని పరిచయం చేసిందే చిరంజీవి. అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం చిరంజీవిని మరిచిపోదు. తెలుగు ప్రేక్షకులు కూడా చిరంజీవిని ఎంతో అభిమానిస్తారు. ఇండస్ట్రీకి ఆయన ఒక పెద్ద దిక్కులా ఉండటం… ఈ వయసులో కూడా సినిమాలు తీస్తూ తన అభిమానులను అలరించడం అనేది అంత ఈజీ కాదు. అయినప్పటికీ.. సినిమాలు తీస్తున్నారు. ప్రేక్షకులను అలరిస్తున్నారు.
చిరంజీవి ప్రస్తుతం హీరోగా నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాకు సంబందించిన మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ లాంటివి ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. అవి సోషల్ మీడియాలో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఇటీవలే లాహే లాహే అనే సాంగ్ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో చిరు వేసిన స్టెప్పులు చూసి అభిమానులు ఉర్రూతలూగిపోతున్నారు. చాలా రోజుల తర్వాత చిరంజీవి స్టెప్పులేయడంతో అందరూ మైమరిచిపోతున్నారు. అన్నయ్య స్టెప్పులకు ఫిదా అవుతున్నారు..
లాహే లాహే ప్రోమోలో చిరు కేవలం ఒకే ఒక స్టెప్పు వేసినా.. ఆ స్టెప్పుకు ఈల వేసి గోల చేయకుండా ఉండలేకపోతున్నారు చిరు అభిమానులు. ఎప్పుడు ఆ పాటకు సంబందించిన ఫుల్ సాంగ్ వస్తుందా? అని అంతా వెయిట్ చేస్తుండగా… తాజాగా ఆ పాటకు సంబంధించిన ఫుల్ సాంగ్ ను విడుదల చేసింది మూవీ యూనిట్.
ప్రోమో కేవలం 15 సెకండ్లు ఉంటేనే చిరు అభిమానులు తట్టుకోలేకపోయారు. ఇక ఫుల్ సాంగ్ వచ్చాక చిరు అభిమానులు ఆగుతారా? రెచ్చిపోతున్నారు. తాజాగా విడుదలైన లాహే లాహే ఫుల్ సాంగ్ యూట్యూబ్ లో సంచలనాలను సృష్టిస్తోంది.
ఈ పాట కోసం సపరేట్ సెట్ వేసి 500 మంది డ్యాన్సర్లతో ఈ పాటను చిత్రీకరించారట డైరెక్టర్ కొరటాల శివ. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. పూర్తిగా నక్సలిజం బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా వస్తోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.