Home » News » Current Cuts That Change Brides Viral News
News

Viral News : ఒక‌రితో నిశ్చ‌యం మ‌రొక‌రి మెడ‌లో తాళీ.. పెళ్లికూతుళ్ల‌నే మార్చేసిన క‌రెంట్ కోత‌

Authored By
mallesh
The Telugu News | Published on: May 11, 2022, 2:00 pm
Advertisement

Viral News : సాధార‌ణంగా క‌రెంట్ లేక‌పోతేనే ఇబ్బందిప‌డ‌తాం.. అలాంటిది ఇంట్లో ఫంక్ష‌న్ ఉన్న‌ప్పుడు క‌రెంట్ లేక‌పోతే ఆ క‌ష్టాలు మామూలుగా ఉండ‌వు. ఎవ‌రో ఏంటో తెలియ‌క ఇబ్బంది ప‌డ‌తాం. బంధువులు తిన్నారా లేదా ఫంక్ష‌న్ కార్య‌క్ర‌మం ఎలా జ‌రుగుతుందో కూడా అర్థం కాదు. ఈ లోగా ఎన్నో తారుమారు అవుతుంటాయి.. ఇంత‌వ‌ర‌కు ఓకే కానీ ఓ పెళ్లిలో క‌రెంట్ పోవ‌డ‌తో ఏకంగా పెళ్లి కూతుర్లే మారిపోయారు. ఒక‌రికి క‌ట్టాల్సిన తాళీ మ‌రొక‌రికి క‌ట్టేశారు. ఇదంతా సినిమాల్లో అయితే ఓకే కానీ నిజ‌జీవితంలో అయితే ఎన్నో తంటాలు తెచ్చిపెడుతుంది. క‌రెంట్ చేసిన ప‌నికి పెళ్లిలో వ‌ధువులు మారిపోవ‌డంతో అంతా అవాక్క‌య్యారు.

Advertisement

క‌రెట్ లేకపోతే లైఫే తారుమారు అవుతుంద‌ని నిరూపించింది.అదెక్క‌డో ఇప్పుడు చూద్దాం..ఈ వింత ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఉజ్జ‌యినిలో జ‌రిగింది. ఈ ప్రాంతానికి చెందిన ర‌మేష్ లాల్ కు నిఖిత‌, రేష్మా అనే కూతుళ్లు ఉన్నారు. అయితే వీళ్ల‌కి ఒకే మూహుర్తంలో పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యించాడు. ఇద్ద‌రికీ వేర్వేరు అబ్బాయిల‌ను ఫిక్స్ చేశాడు. పెళ్లి ప‌నులు మొద‌లు పెట్టారు. అయితే మండ‌పంలో స‌డెన్ గా క‌రెంట్ పోవ‌డంతో వ‌ధూవ‌రులు కూర్చునే ప్లేస్ మారిపోయింది. అయితే పొర‌పాటు ఎక్క‌డ జ‌రిగిందంటే.. ఇద్దరు పెళ్లి కూతుర్లు ఒకే వేషాధ‌ర‌ణ ఉండ‌టం, ముఖాలు క‌నిపించ‌కుండా ముసుగులు ఉండ‌టంతో కాస్తో కూస్తో వెలుగు ఉన్నా తేడా క‌నిపించ‌లేదు.

Current cuts that change brides Viral News

Advertisement

ఇక తాళీ క‌ట్టే స‌మ‌యానికి ఇద్ద‌రు పెళ్లి కొడుకులు చేరో పెళ్లి కూతురుకి తాళీ క‌ట్టేశారు. తీరా చూస్తూ పెళ్లి కూతుర్లు మారిపోయారు. ఒక‌రితో పెళ్లి నిశ్చ‌య‌మైతే మ‌రొక‌రికి తాళీ క‌ట్టారు. దీంతో అంతా అవాక్కై తేరుకున్నారు.దీంతో గొడ‌వ‌కు దారితీసింది. అయితే ఇది ఎవ‌రూ కావాల‌ని చేసిన త‌ప్పు క‌క‌పోవ‌డంతో స‌ద్దుమ‌ణిగేలా చేశారు. ఇక చేసేది ఏమిలేక మ‌రో సారి నిశ్చ‌యించిన పెళ్లి కూతురితోనే పెళ్లి చేయాల‌ని ఫిక్స్ అయ్యారు. ఇలా క‌రెట్ తెచ్చిన క‌ష్టాలు ఏకంగా పెళ్లి కూతురినే మార్చేస్తాయిని ఎవ‌రూ ఊహించ‌లేదు. ఈ సంఘ‌ట‌న‌తో పెళ్లి విష‌యంలో ఒక‌టికి రెండు సార్లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అర్థం అవుతోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి