Categories: NationalNews

Ajit Pawar : విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ మృతి

Advertisement
Advertisement

Ajit Pawar: మహారాష్ట్రలో ఘోర విషాదం సంభవించింది. విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పవార్‌ (66)తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్‌ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబయి నుంచి బారామతి వెళ్తుండగా ఉదయం 8.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో ప్రయాణిస్తున్న ఇదుగురూ మరణించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారికంగా ధ్రువీకరించింది. విమానంలో ఎవరూ బతికి లేరని వెల్లడించింది. అజిత్‌ పవార్‌తో పాటు ముంబయి పీఎస్‌వో వదీప్‌ జాదవ్‌, కెప్టెన్‌ సుమిత్ కపూర్‌, కెప్టెన్‌ శాంభవి పాఠక్‌, ఫ్లైట్‌ అటెండెంట్‌ పింకీ మాలి మరణించినట్లు తెలిపింది.

Advertisement

Ajit Pawar : విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ మృతి

సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ముంబయి నుంచి బయల్దేరిన గంట తర్వాత విమానంలో సమస్య తలెత్తింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ సమయంలో విమానం అదుపుతప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు విమానం రెండు ముక్కలైనట్లు తెలుస్తోంది. విమాన శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సేవలు, భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మూడు మృతదేహాలను బారామతి మెడికల్ కాలేజీకి తరలించామని మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని పుణె ఎస్పీ తెలిపారు. డీజీసీఏ అధికారుల బృందం కూడా ప్రమాద స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది.

Advertisement

ఇక ప్రమాద వార్త తెలియగానే అజిత్ పవార్ కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారు వెంటనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఫోన్ చేసి ప్రమాద వివరాలను తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాగా, అజిత్‌ పవార్‌ 1959 జులై 22న జన్మించారు. ఆయన తండ్రి అనంత్‌రావ్‌ పవార్‌.. సీనియర్‌ రాజకీయ నాయకుడు, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్‌ పవార్‌కు సోదరుడు. బాబాయి శరద్‌ పవార్‌ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అజిత్‌పవార్‌.. 1982లో తొలిసారి కార్పొరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 16 ఏళ్ల పాటు పుణె జిల్లా సెంట్రల్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు.

1991లో తొలిసారి బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత బాబాయి శరద్‌ పవార్‌ కోసం ఆ సీటును త్యాగం చేసి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. 1991 ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. అజిత్‌ పవార్‌కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. భార్య సునేత్ర పవార్‌ రాజ్యసభ ఎంపీగా వ్యవహరిస్తున్నారు.

 

Advertisement

Recent Posts

Arava Sreedhar : డిల్లీ ని తాకిన జనసేన ఎమ్మెల్యే రాసలీలల వ్యవహారం .. ఉగ్రూపంతో అమిత్ షా ఆదేశాలు

Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక…

16 minutes ago

Ibomma Ravi : ఐ బొమ్మ రవి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్

Ibomma Ravi : ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా కోట్లాది రూపాయలు గడించిన రవి, కేవలం ఒక సాధారణ పైరేట్ మాత్రమే…

46 minutes ago

Perni Nani : పేర్ని నాని ని అరెస్ట్ చేయబోతున్నారా ?

Perni Nani : గత కొద్దీ రోజులుగా సైలెంట్ గా ఉన్న వైసీపీ నేతలు మళ్లీ నోటికి పనిచెపుతున్నారు. సీఎం…

2 hours ago

School Holidays : మళ్లీ స్కూళ్లకి వరుసగా 5 రోజులు సెలవులు?..ఎందుకంటే..!

School Holidays: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఆధ్యాత్మిక మహోత్సవంగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు సమయం ఆసన్నమైంది. జనవరి 28…

3 hours ago

Gold Rate Today on January 28th 2026 : బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట..ఈరోజు బంగారం ధరలు ఇలా !!

Gold Rate Today on Jan 28th 2026 : గత కొద్దీ రోజులుగా బంగారం ధరలు పెరగడమే తప్ప…

4 hours ago

Brahmamudi Today Episode: మంత్రికి వార్నింగ్ ఇచ్చిన కావ్య.. నిజం ఒప్పుకున్న ధర్మేంద్ర.. 15 రోజుల డెడ్‌లైన్

Brahmamudi Today Episode: బ్రహ్మముడి సీరియల్ 941వ ఎపిసోడ్ ప్రేక్షకులను పూర్తిగా కట్టిపడేసేలా సాగింది. కావ్య–ధర్మేంద్ర ట్రాక్‌లో కీలక మలుపులు…

4 hours ago

Karthika Deepam 2 Today Episode : కార్తీకదీపం: ఇది నవవసంతం – జ్యోత్స్న ప్లాన్‌ను పసిగట్టిన దీప, కార్తీక్.. నిజం బయటపడుతుందా?

Karthika Deepam 2 Today Episode : బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న 'కార్తీకదీపం: ఇది నవవసంతం' సీరియల్ ఇప్పుడు ఎంతో…

5 hours ago

Screen Time Guidelines: అతిగా ఫోన్‌ చూస్తున్నారా?..మీ ఒంట్లో వచ్చే సమస్యలు ఇవే..?

Screen Time Guidelines: నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ లేకుండా జీవితం ఊహించలేనిది. పని అయినా చదువు…

5 hours ago