Home » Andhra Pradesh » Dharmavaram Mla Kethireddy Money Help To Poor Man
andhra pradesh

MLA Kethireddy : గాడిద.. కాలు ఇరిగిందని ముందే చెప్పాలి కదా.. ఈ 50 వేలు తీసుకొని ఆసుపత్రికిపో… వీడియో

Authored By
Breaking News 2
The Telugu News | Published on: March 31, 2023, 9:00 am
Advertisement

MLA Kethireddy : ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆయన ఏంటో అందరికీ తెలుసు. ఆయన తన నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను ప్రతి రోజు తెలుసుకొని వాటిని అప్పటికప్పుడే పరిష్కరిస్తారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో వచ్చే వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటాయి. తాజాగా ఆయన ఓ గల్లీలో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటి దగ్గరికి వెళ్లిన కేతిరెడ్డి.. 

Advertisement

dharmavaram MLA Kethireddy money help to poor man

ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడుగుతాడు. దీంతో ముందు ఆ వ్యక్తి తమకు ఇల్లు రాలేదని చెబుతాడు. దీంతో ఇల్లు మీకు ముందే ఇచ్చాం కదా అంటే.. ఇచ్చారు కానీ కట్టుకోలేదు అంటాడు. దీంతో మూడేళ్లు దాటితే కట్టించుకోకపోతే వేరే వాళ్లకు వెళ్లిపోతుంది కదా అని ఎమ్మెల్యే చెబుతారు. మళ్లీ వాళ్లు రిక్వెస్ట్ చేయడంతో మరోసారి ఇల్లు ఇస్తాం. ఈసారి ఎలాగైనా కట్టుకోండి అని చెబుతారు ఎమ్మెల్యే. ఆ తర్వాత ఎమ్మెల్యే వెళ్లిపోతుండగా సార్ నాకు మోకాలి చిప్ప పగిలింది సార్ అంటాడు. ఏమైంది అంటే.. ఆపరేషన్ చేయించుకోవాలి. 

Advertisement

MLA Kethireddy Money Help : మోకాలి చిప్ప పగిలిందని చెప్పిన యువకుడు

మోకాలి చిప్ప మార్చుకోవాలి అంటాడు. దీంతో సర్టిఫికెట్ చేయించుకుంటే నాకు ఆసుపత్రుల్లో ఫ్రీ ఇస్తారు అంటాడు. దీనికి ఆపరేషన్ చేయించుకోవాలి కదా అంటే.. అవును అంటాడు. దీంతో వెంటనే తన జేబులో ఉన్న రూ.50 వేలు తీసి కేతిరెడ్డి అతడికి ఇచ్చి వెంటనే వెళ్లి మోకాలు ఆపరేషన్ చేయించుకో. ఇక్కడ ఉండే బదులు అక్కడికి వచ్చి డబ్బులు అడిగితే ఇచ్చేవాడిని కదా గాడిద అంటూ కొంచెం సేపు అతడిపై సీరియస్ అవుతారు ఎమ్మెల్యే. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి