Home » Entertainment » Extra Jabardasth Latest Promo Rashmi And Sudigali Sudheer
Entertainment

రష్మీతో లాంగ్ డ్రైవ్ కు వెళ్లిన సుడిగాలి సుధీర్.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: June 7, 2021, 4:16 pm
Advertisement

బుల్లితెర క్రేజీ జంట ఎవరు అని అడిగితే టక్కున గుర్తొచ్చే జంట సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ. వీళ్లిద్దరి జంట ఎంత చూడముచ్చటగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ జంట క్రేజ్ ఇప్పుడు మొదలైంది కాదు.. దాదాపు ఆరేడు సంవత్సరాల నుంచి ఈ జంటకు ఉన్న క్రేజ్ చూస్తే మతి పోతుంది. బుల్లితెర మీ ఏ షో అయినా సరే.. ఈ జంట పార్టిసిపేట్ చేసిందంటే ఆ షో సూపర్ సక్సెస్ కావాల్సిందే. అది ఈ జంటకు ఉన్న పాపులారిటీ. జబర్దస్త్ తో వీళ్ల ప్రయాణం ప్రారంభం అయింది. ఇంకా కొనసాగుతూనే ఉంది. వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఉందని గుసగుసలు వినిపిస్తున్నా.. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని చెబుతుంటారు. కానీ.. రష్మీ, సుధీర్ చేష్టలు చూస్తే మాత్రం వీళ్లు ఫ్రెండ్స్ మాత్రమే కాదు.. అంతకు మించి అని చెప్పుకోవచ్చు.

Advertisement

extra jabardasth latest promo rashmi and sudigali sudheer

అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్స్ ట్రా జబర్దస్త్ ను జనాలు చూస్తున్నారు అంటే దానికి కారణం సుధీర్, రష్మీ. ఈ జంట కోసమే జబర్దస్త్ ను చూసేవాళ్లు కోకొల్లలు. ఏది ఏమైనా.. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని కోట్లాది మంది సుధీర్ అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు. బుల్లితెర మీద ఈ జంటకు ఉన్న అభిమానులు కూడా ఏ జంటకూ లేరు. వీళ్లు పెళ్లి చేసుకోకపోయినా.. వీళ్ల అభిమానులే వీళ్ల పెళ్లి చేసేలా ఉన్నారు.

Advertisement

ఎక్స్ ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ప్రేమలో మునిగిపోయిన రష్మీ, సుధీర్

extra jabardasth latest promo rashmi and sudigali sudheer

తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో సుధీర్, రష్మీనే మరోసారి హైలెట్. ఓ స్కిట్ లో ఇద్దరూ కలిసి నటించారా? లేక ప్రేమించుకున్నారా? అనేదే అర్థం కాదు. రష్మీ లాంగ్ డ్రైవ్ వెళ్తుంటే.. మధ్యలో తన కారును ఆపి లిఫ్ట్ అడిగి రష్మీ కారు ఎక్కాడు సుధీర్. ఆ తర్వాత చూసుకోండి.. వీళ్ల మధ్య జరిగిన ప్రేమాయణం మామూలుగా లేదు. ఎంతైనా లవర్స్ కదా. ఇద్దరూ కారులో ఏకాంతంగా లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ చేసిన హడావుడిని మీరు చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం.. ఎక్స్ ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోను చూసేయండి.

Advertisement

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి