Online Games : ఇటీవల కాలంలో ఆన్‌లైన్ గేమ్స్‌తో చాలా మంది అప్పులబారిన పడుతున్నారు. ఈ గేమ్స్ సరదాగా అనిపించిన తర్వాత తర్వాత ఆ గేమ్స్ వలన ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. గతంలో చాలా మంది కూడా ఆన్‌లైన్ గేమ్స్ వలన ప్రాణాలు తీసుకున్నారు. కొందరు అయితే ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చంపుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా ఓ కుటుంబం ఆన్‌లైన్ గేమ్‌ల వలన లేనిపోని కష్టాలలో చిక్కుకొని జీవితం చిన్నాభిన్నం అయ్యేలా చేసుకుంది. వివరాలలోకి వెళితే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఇందిర(38)కు గతంలో ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. కొన్నాళ్లపాటు వారి జీవితం మంచిగానే ఉండేది. అయితే కొంతకాలానికి ఆయన గుండెపోటుతో కన్నుమూసాడు.
ఇక భర్త చనిపోయిన నాలుగేళ్లకి రామాంతపూర్‌కి చెందిన ఆనంద్(42) అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది ఇందిర. ఈ జంటకి మూడేళ్ల విక్కీ సంతానంగా ఉన్నారు. ఆనంద్ కూడా మొదటి భార్యకి విడాకులు ఇచ్చి ఆమెని వివాహం చేసుకున్నాడు. అయితే ఈ కుటుంబం గత మూడేళ్లుగా బండ్లగూడ జాగీర్ సన్ సిటీలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. బతుకుతెరువు కోసం ఇందిర ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా ఆనంద్ కొంతకాలం పాల వ్యాపారం చేసి అందులో నష్టాలు రావడంతో ఇక ఖాళీగా ఉన్నాడు. కొంత కాలంగా ఆన్‌లైన్ గేములు ఆడుతూ వచ్చాడు. దీంతో చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు. అప్పులు కూడా చేశాడు.
అయితే తాను చేసిన అప్పులను తీర్చడానికి ఇందిరకు సంబంధించిన బంగారాన్ని అమ్మడమే కాకుండా కారును కూడా అమ్మేశాడు. ఈ మధ్యకాలంలో అపార్ట్మెంట్ ఫ్లాటును సైతం విక్రయించాలని ఇందిరతో గొడవ పెట్టుకున్నాడు.ఇద్దరి మధ్య పెద్ద గొడవ కావడంతో వారు తీవ్ర మనస్థాపానికి లోనయ్యారు. అయితే అపార్ట్‌మెంట్ అమ్మే విషయంలో భార్య ఒప్పుకోలేదన్న కోపంతో కుమారుడికి, భార్యకు కూల్ డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్యామిలీ మొత్తం ఆన్‌లైన్ గేమ్ వలన ఛిన్నాభిన్నం కావడంతో ఇది తెలుసుకున్న ప్రతి ఒక్కరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ గేమ్స్‌ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
This website uses cookies.