Home » News » Girlfriend Murdered Her Boyfriend
News

Girlfriend Murdered Her Boyfriend : ఫోన్ నంబర్ బ్లాక్ చేశాడనే కోపంతో ప్రియుడిని హత్య చేసిన ప్రేయసి

Authored By
Sudheer Ramanujam
The Telugu News | Published on: February 4, 2026, 8:40 pm
Advertisement

Girlfriend Murdered Her Boyfriend : ఇటీవల కొంతమంది మహిళలు రెచ్చిపోతున్నారు. చిన్న చిన్న వాటికే ప్రాణాలు తీస్తున్నారు. ముఖ్యంగా అక్రమ సంబంధాల మోజులో పడి కట్టుకున్న భర్తను , కడుపునా పుట్టిన బిడ్డలను కూడా హత్య చేయడం , చేయించడం చేస్తున్నారు. తాజాగా ప్రియుడు తన ఫోన్ నంబర్ బ్లాక్ చేశాడనే కోపంతో, ఓ యువతి కత్తితో తన ప్రియుడిని పొడిచింది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో ఈ అత్యంత విషాద ఘటన చోటుచేసుకుంది. మృతుడు కమ్తా ప్రసాద్ సూర్యవంశీ (25) – సదరు యువతీ మధ్య సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. అయితే, ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో కమ్తా ప్రసాద్ ఆమె నంబర్‌ను బ్లాక్ చేశాడు. ఈ అవమానాన్ని భరించలేకపోయిన సదరు యువతి, పక్కా పథకం ప్రకారం కత్తితో అతని గదికి వెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది.

Advertisement

Girlfriend Murdered Her boyfriend : ఫోన్ నంబర్ బ్లాక్ చేశాడనే కోపంతో ప్రియుడిని హత్య చేసిన ప్రేయసి

స్థానిక సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ‘శుభమ్ విహార్ టీచర్స్ కాలనీ’లో ఈ హత్య జరిగింది. నిందితురాలు ప్రియుడి ఇంటికి వెళ్లి, తన నంబర్ ఎందుకు బ్లాక్ చేశావని నిలదీసింది. అంతేకాకుండా, అతని మొబైల్ ఫోన్ లాక్కొని అందులోని చాటింగ్స్‌ను చూపించాలని ఒత్తిడి చేసింది. దీనికి కమ్తా ప్రసాద్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన యువతి, తాను తెచ్చుకున్న కత్తితో అతనిపై విచక్షణారహితంగా దాడి చేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

Advertisement

ఈ ఘటనపై సమాచారం అందుకున్న బిలాస్‌పూర్ పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేవలం ఒక ఫోన్ నంబర్ బ్లాక్ చేయడం మరియు మొబైల్ డేటా చూపించకపోవడం వంటి చిన్న కారణాలకే ప్రాణాలు తీసే స్థాయికి యువత వెళ్లడం పట్ల సమాజంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పోలీసులు వారిద్దరి ఫోన్ కాల్ డేటా మరియు సోషల్ మీడియా రికార్డులను పరిశీలిస్తూ, ఈ హత్య వెనుక ఇంకా ఏవైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు.

Sudheer Ramanujam

Author Bio Info : Sudheer Ramanujam Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి