Home » Andhra Pradesh » Hijras Filed Case Against Balakrishna Behind That There Was Ycp People
andhra pradesh

Balakrishna : బాల‌య్యని టార్గెట్ చేసిన హిజ్రాలు..ఏకంగా కేసు కూడా పెట్టారా..!

Authored By
Sam C
The Telugu News | Published on: September 29, 2022, 9:30 pm
Advertisement

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ ఒక‌వైపు సినిమాలు మ‌రోవైపు రాజ‌కీయాలలో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇటీవ‌ల బాల‌కృష్ణ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై తనదైన శైలిలో మండిపడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని, వైయస్సార్ సిపి సర్కార్ ను టార్గెట్ చేశారు. ఇక వైఎస్సార్సీపీ నేతలు కూడా బాలయ్య ను టార్గెట్ చేసిన నిప్పులు చెరిగారు. మంత్రులు సైతం బాలయ్యకు చురకలంటించారు. సోష‌ల్ మీడియాలో మంత్రులు చుర‌క‌లంటించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో తాజాగా బాలకృష్ణ పై హిందూపురం పోలీస్ స్టేషన్ లో కొందరు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. హిజ్రాలు ఆయనపై కేసు పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటికే బాలయ్యపై ఇలాంటి కేసులు చాలా నమోదు అయ్యాయి.

Advertisement

Balakrishna : బాల‌య్య‌పై కేసు..

కానీ అందులో హిజ్రాలు కేసు పెట్టడం ఇదే తొలిసారి.. అయితే వారు కేసు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే..?.. హిందూపురంలో బాలయ్య ఉండడంలేదని కొంతమంది హిజ్రాలు బాలయ్యపై ఫిర్యాదు చేశారు. గతంలో బాలయ్య పై ఇదే తరహా కేసులు చాలా నమోదయ్యాయి.. అయితే అందులో ఎక్కువ ప్రత్యర్థి పార్టీకి చెందిన కార్యకర్తలే ఇలాంటి కేసులు పెట్టారని.. స్థానిక నేతలు దగ్గరుండి ఇలాంటి కేసులు పెట్టించారన్నది టీడీపీ నేతల వాదన.. ఈ ఫిర్యాదుపై టిడిపి నేతలు నిప్పులు చెరుగుతున్నారు.

Hijras filed Case Against Balakrishna Behind that there was YCP people

Advertisement

వైసీపీ నేతలు హిజ్రాలను ముందు పెట్టి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారని, హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ఉన్న ఇక్బాల్ కు చెందిన వర్గం నేతలు బాలకృష్ణ పై కావాలని హిజ్రాలతో ఫిర్యాదు చేయించారని టిడిపి నేతలు మండిపడుతున్నారు. ఆయన జగన్ దృష్టిలో పడాలన్న తాపత్రయంతో ఈ విధమైన పనులకు పాల్పడుతున్నాడని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో ఉన్నా, లేకపోయినా నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో, అభివృద్ధి విషయంలో ఎప్పుడు వెనకడుగు వేయటం లేదని టిడిపి నేతలు చెబుతున్నారు. మ‌రి ఈ వివాదం రానున్న రోజుల‌లో ఇంకెలా టర్న్ తీసుకుంటుందో చూడాలి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి