TRS : టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ. అయినా కూడా పార్టీ భవిష్యత్తులో తెలంగాణలో రాణించాలన్నా.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలన్నా… కొన్ని అంశాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే… తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులన్నీ మారిపోయాయి. ఓవైపు బీజేపీ తెలంగాణలో బలపడుతోంది. మరోవైపు షర్మిల పార్టీ పెడుతున్నారు. కాంగ్రెస్ కూడా బలపడుతోంది. ఈ నేపథ్యంలో ఒక అధికార పార్టీగా టీఆర్ఎస్ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. సీఎంగా కేసీఆర్ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నిజానికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం చాలా సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. తెలంగాణ అభివృద్ధిలో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించింది. అయితే… కానీ… ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లేందుకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇతర కీలక నేతలు కృషి చేయాలి. ఎందుకంటే… అధికార పార్టీగా టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల కోసం ఏం చేస్తోందనేది ప్రజలకు తెలియకపోతే ఎట్లా. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా టీఆర్ఎస్ పార్టీ జాగ్రత్తగా అడుగులు వేయాలి.
ఇవన్నీ పక్కన పెడితే… పార్టీలో అంతర్గతంగా ఉండే సమస్యలపై కూడా పార్టీ అధిష్ఠానం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీలోని కొందరు కీలక నేతలు…. పార్టీ మారడానికి చూస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అధికార పార్టీ నుంచి వేరే పార్టీలో చేరడం అంటే అది నిజంగా పార్టీకి మాయని మచ్చే. ఆ మచ్చను రాకుండా చేసుకునేందుకు పార్టీ అధిష్ఠానం సీరియస్ గా ముందుకు వెళ్లాలి. లేకపోతే… పార్టీపై ప్రజల్లో చులకన భావం వచ్చే అవకాశం ఉంది.
తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ బలపడుతోంది. బీజేపీ నేతలు కూడా పార్టీని బలంగా తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో పార్టీని చాలా సునాయసంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నారు. దీని వల్ల టీఆర్ఎస్ పార్టీకి తీరని నష్టం జరుగుతోంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్. నిజానికి ఇది రాజకీయ పార్టీ కాదు. కానీ.. తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయ పార్టీగా మారాల్సి వచ్చింది. కేవలం తెలంగాణ కోసం పుట్టిన పార్టీ కాబట్టి… తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన పార్టీ కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే…. పార్టీ అధిష్ఠానం, కీలక నేతలు… చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం ఇది.
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
This website uses cookies.