Home » News » Increase In Prices Of Cooking Oil And Pulses
News

Commodity Prices : సామాన్యులకు భారీ షాక్‌ .. పెరిగిన వంటనూనె, పప్పుల ధరలు.. ఎంతో తెలుసా ?

Authored By
Suma
The Telugu News | Published on: February 3, 2026, 6:00 pm
Advertisement

Commodity Prices : సామాన్యుల జీవనంపై ధరల భారం రోజు రోజుకు పెరుగుతోంది. నిత్యావసరాల జాబితాలో కీలకమైన వంటనూనె, పప్పుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే ఈ వస్తువుల ధరలు భారీగా పెరగడం గమనార్హం. ఇప్పటికే పెరిగిన కూరగాయల ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది మరో షాక్‌గా మారింది. ముఖ్యంగా రోజువారీ కూలీ పనులు చిన్న ఉద్యోగాలతో జీవనం సాగించే వారికి ఈ పెరుగుదల పెద్ద భారంగా మారుతోంది.

Advertisement

Commodity Prices : సామాన్యులకు భారీ షాక్‌ .. పెరిగిన వంటనూనె, పప్పుల ధరలు.. ఎంతో తెలుసా ?

Commodity Prices : వంటనూనె ధరల్లో అనూహ్య పెరుగుదల

వంటింట్లో తప్పనిసరిగా అవసరమయ్యే వంటనూనె ధరలు గత నెలతో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర రూ.167గా ఉంది. జనవరి ప్రారంభంలో ఇది రూ.150కే లభించేది. అలాగే వేరుశెనగ నూనె ధర ప్రస్తుతం రూ.180కి చేరింది. గత నెలలో ఇది రూ.160గా ఉండగా ఇప్పుడు రూ.20 పెరిగింది. పామాయిల్ విషయానికి వస్తే 850 గ్రాముల ప్యాకెట్ ధర మార్కెట్లో రూ.120గా కొనసాగుతోంది. గతంలో ఇదే ప్యాకెట్ రూ.110కే లభించేది.
ధరలు పెరుగుతున్న నేపథ్యంలో నూనె తయారీ కంపెనీలు మరో మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. లీటర్ ప్యాకెట్లకు బదులుగా 910 గ్రాములు, 850 గ్రాములు, 800 గ్రాముల ప్యాకెట్లను విక్రయిస్తూ వినియోగదారులపై పరోక్ష భారం మోపుతున్నాయి. కంపెనీలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ మొత్తం మీద నూనె ధరలు సామాన్యుడి బడ్జెట్‌ను కుదించేస్తున్నాయి.

Advertisement

Commodity Prices : పప్పుల ధరలు పెరిగి కిచెన్ బడ్జెట్ గందరగోళం

వంటనూనెలతో పాటు పప్పుల ధరలు కూడా భారీగా పెరిగాయి. కేజీ కంది పప్పు ప్రస్తుతం మార్కెట్లో రూ.130కి చేరింది. గత నెలలో ఇదే పప్పు రూ.110కే దొరికేది. మినపప్పు ధరలు కూడా కేజీకి రూ.20 మేర పెరిగాయి. వేరుశనగ పలుకుల ధరలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. వారం రోజుల క్రితం కేజీ రూ.140గా ఉన్న వేరుశనగ పలుకులు ఇప్పుడు రూ.200కి చేరాయి. ఇక ఎండుమిర్చి ధరలు కూడా పెరిగాయి. వారం రోజుల క్రితం కిలో రూ.240గా ఉండగా ఇప్పుడు రూ.300 పలుకుతోంది. పండుగల సీజన్ లేకపోయినా ఈ విధంగా ధరలు పెరగడం వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రోజూ ఉపయోగించే ఈ సరుకుల ధరలు పెరగడంతో ఇంటి ఖర్చులు అదుపు తప్పుతున్నాయి.

Commodity Prices : కూరగాయల ధరలు మాత్రం కొంత ఊరట

ఇక కూరగాయల ధరల విషయానికి వస్తే హైదరాబాద్‌లోని పటాన్‌చెర్వు మార్కెట్ యార్డులో ప్రస్తుతం కొంత ఊరట కనిపిస్తోంది. కేజీ టమాట రూ.20, వంకాయ రూ.20, బెండకాయ రూ.30గా ఉన్నాయి. క్యాలీఫ్లవర్, క్యారెట్ కేజీకి రూ.30 చొప్పున లభిస్తున్నాయి. బీరకాయ రూ.50, దొండకాయ రూ.60గా ఉన్నాయి. బీన్స్ రూ.30, మిర్చి రూ.60, ఉల్లిపాయ రూ.30, సొరకాయ రూ.20, బీట్‌రూట్ రూ.30, క్యాప్సికం రూ.50గా ఉన్నాయి. అయితే కూరగాయల్లో కొంత ఉపశమనం ఉన్నప్పటికీ వంటనూనె మరియు పప్పుల ధరల పెరుగుదల మొత్తం కిచెన్ బడ్జెట్‌ను కుదించేస్తోంది. ధరల నియంత్రణపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో సామాన్యులపై భారం మరింత పెరిగే అవకాశం ఉందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి