two bowlers used in one over in ipl
IPl 2022 : ఐపీఎల్ హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల మెగా వేలం జరగగా, త్వరలోనే మ్యాచ్‌లు ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. మొత్తం 10 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాయి. మరో వైపు ఈ లక్నో, అహ్మదాబాద్ రూపంలో కొత్త జట్లు రావడంతో ఈ ఏడాది సీజన్ మరింత రసవత్తరంగా జరగనుంది. ఇక ఐపీఎల్-2022 షెడ్యూల్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదరు చూస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 27 నుంచి ప్రారంభం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది అన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు అహ్మదాబాద్, ముంబై, పూణేలోని 6 స్టేడియాల్లో జరిగే అవకాశం ఉంది.
మ్యాచ్‌లు మహరాష్ట్రలోని వాంఖడే, బ్రబౌర్న్, డాక్టర్ డివై పాటిల్, రిలయన్స్ జియో స్టేడియాల్లో జరిగే ఛాన్స్ ఉంది. కాగా ఇప్పటికే ఈ స్టేడియాలను ముంబై క్రికెట్ ఆసోసియేషన్ సిద్దం చేసినట్లు వినికిడి. అదే విధంగా ఒక వేళ మార్చి 26న టోర్నీ ప్రారంభమైతే.. ప్రసారం చేయడానికి బ్రాడ్‌కాస్టర్ డిస్నీ స్టార్ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్–2022లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్న కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ తమ లోగోను ఆదివారం రివీల్ చేసింది. మిగతా ఫ్రాంచైజీలకు భిన్నంగా మెటావర్స్ (వర్చువల్ స్పేస్)లో ‘ది టైటాన్స్ డగౌట్’ పేరుతో లోగోను రిలీజ్ చేశారు. ఇందులో టీమ్ కోచ్ ఆశిష్ నెహ్రా, కెప్టెన్ హార్దిక్, శుభ్ మన్ గిల్ కనిపించారు.
ipl 2022 new schedule
శ్రీలంకతో టెస్ట్ సిరీస్ మార్చి 16న పూర్తవుతుంది కాబట్టి లీగ్‌ను ఒక రోజు ముందుకు జరపడం వల్ల భారత ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, దీనివల్ల ఆస్ట్రేలియా ప్లేయర్లు మాత్రం లీగ్‌లో మరో మ్యాచ్‌ను మిస్సయ్యే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్ పర్యటన ఉన్న నేపథ్యంలో వారంతా ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఏప్రిల్ 6 తర్వాతే మ్యాచ్‌లకు అందుబాటులోకి రానున్నారు. వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య సిరీస్‌ల నేపథ్యంలో ఈ రెండు దేశాల ఆటగాళ్లు ఏప్రిల్ 5న అందుబాటులోకి రానున్నారు. ఈ ప్రతిపాదనపై బీసీసీఐ చర్చలు జరుపుతుంది. బోర్డు కూడా ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తొంది. అన్ని అనుకున్నట్లు జరిగితే మార్చి 26నే లీగ్ ప్రారంభం కానుంది’అని ఓ ఫ్రాంచైజీ అధికారి తెలిపారు.
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్‌లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
This website uses cookies.