Janaki Kalaganaledu 17 Aug Today Episode : జానకి కలగనలేదు సీరియల్ 17 ఆగస్టు 2021 మంగళవారం ఎపిసోడ్ తాజాగా రిలీజ్ అయింది. 107 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి డిగ్రీ పట్టా అందుకుంటుండగానే.. రామా పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తాడు. రామా రాగానే తను డిగ్రీ పట్టాను తీసుకుంటుంది. రామాతో పాటు అక్కడున్నవారంతా చప్పట్లు కొడుతుంటారు. దీంతో జానకి సంతోషంతో ఉప్పొంగిపోతుంది. జానకికి గోల్డ్ మెడల్ కూడా వేస్తారు. ఇంతలో జ్ఞానాంబ కారులో కాలేజీ దగ్గరికి వస్తుంది. ఇక.. జానకి తనకు వచ్చిన మెడల్ ను చూసి తెగ మురిసిపోతుంది. ఆల్ ది బెస్ట్ జానకి.. మంచి మార్కులతో కాలేజీ టాపర్ అయ్యావు.. నువ్వు భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదగాలి అని కోరుకుంటున్నా.. అని కాలేజీ చైర్మన్ అంటుంది. మేడమ్.. ఒక్క నిమిషం నేను మాట్లాడొచ్చా.. అని అడుగుతుంది జానకి. దీంతో షూర్.. అని చెబుతుంది.
స్టేజ్ మీద మైక్ వద్దకు వెళ్లి.. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఈ డిగ్రీ పట్టా తీసుకున్నానంటే దానికి కారణం మా నాన్న. నేను బాగా చదువుకోవాలని నాకోసం మా నాన్న చాలా ఆరాటపడేవారు. నా చిన్నప్పుడు మా నాన్న ఒక మాట చెప్పారు. ప్రజలకు సేవ చేయడం అంటే దేశానికి సేవ చేయడం. అలా సేవ చేయాలంటే ఒక బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండాలని. ఆ మాటే నేను ఐపీఎస్ కావాలనే కలకు పునాది అయింది. కానీ.. మా నాన్న మరణం నా కలను కన్నీళ్లుగా మార్చేసింది. ఐపీఎస్ అవ్వాలని అనుకున్న నా ఆశ అడియాశ అయినట్టే అని అనుకున్నా. మనం ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు ఆ సమస్యల నుంచి దాటించడానికి దేవుడు ఏదో ఒక రూపంలో వస్తాడని అంటుంటారు. ఆ రూపం పేరే నా భర్త రామచంద్ర.. అని చెబుతుంది.
కళ్లు వేరు కావచ్చు. కానీ కళ మాత్రం ఒక్కటే అని భరోసా ఇచ్చారు. కాళ్లు వేరు కావచ్చు.. కానీ అడుగులు మాత్రం ఒక్కటే అని భరోసా ఇచ్చారు. 99వ మెట్టు దగ్గరే ఆగిపోయిన నా కళను చివరి మెట్టు దగ్గరికి తీసుకెళ్లి గెలిపిస్తానని మా ఆయన నాకు ఒక నమ్మకాన్న ఇచ్చారు. అందుకోసం ఆయన చాలా కష్టపడుతున్నారు. దాదాపుగా ఒక అగ్నిపర్వతాన్న ఆయన మనసులో మోస్తున్నారు. మనకి ఏదైనా చిన్న ఇబ్బంది అవుతుంది అంటేనే అక్కడి నుంచి పారిపోతాం. కానీ.. మా ఆయన మాత్రం తాను ఎదుర్కుంటానని నా చుట్టూ ఒక కోటలా ఏర్పడ్డారు. నా గెలుపులో తన గెలుపును చూసుకోవాలని అనుకుంటున్నారు. ఆయన ప్రేమకు, బాధ్యతకు థ్యాంక్స్ అనేది చాలా చిన్నమాట. కానీ.. అంతకుమించి ఎలా చెప్పాలో నాకు తెలియదు.కానీ.. ఒక్కటి మాత్రం చెబుతాను. మీరే నా బెస్ట్ ఫ్రెండ్.. బెస్ట్ హస్బెండ్. ఐలవ్యూ.. అని చెబుతుంది జానకి.
ఇంతలో జ్ఞానాంబ కాలేజీ గేటు దాటి లోపలికి వస్తుంది. నాన్న.. మీరు లేరు.. కానీ మా ఆయన రూపంలో మీ బాధ్యత మాత్రం అలాగే ఉంది. మీరు నన్ను వదిలిపెట్టి వెళ్లారు. కానీ.. మా ఆయన రూపంలో చేయి పట్టుకొని అలాగే నడిపిస్తున్నారు. రేపు నేను ఐపీఎస్ అయితే అది నా గెలుపు కాదు నాన్నా.. నా భర్త గెలుపు. నీ గెలుపు.. అని అంటుంది జానకి.
మా ఆయన లేకుండా నేను లేను. ఆయన లేకుండా నా జీవితమే లేదు. ఆ జానకిరాములను విడదీసి చూడలేము. ఈ జానకి రాములు కూడా అంతే.. అని చెప్పి తన ప్రసంగాన్ని ముగిస్తుంది జానకి. అందరూ రామాకు కంగ్రాట్స్ చెబుతారు. ఇంతలోనే గ్రాడ్యుయేషన్ హాల్ లోకి వస్తుంది జ్ఞానాంబ. అందరూ గుమికూడి జానకి, రామాకు కంగ్రాట్స్ చెబుతుంటారు. ఇంతలోనే జానకి.. తన డిగ్రీ పట్టాను రామాకు ఇచ్చి చేతులెక్కి మొక్కుతుంది. అందరూ గుమికూడి ఉండటంతో జానకికి రామా, జానకి కనిపించరు. తొంగి తొంగి చూస్తుంది జ్ఞానాంబ.
ఈ గ్రాడ్యుయేషన్ డేను విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.. అని కాలేజీ ప్రిన్సిపాల్ చెప్పడంతో.. జానకి, రామా అక్కడి నుంచి వెళ్తారు. దీంతో అందరూ అక్కడి నుంచి వెళ్తారు కానీ.. జ్ఞానాంబకు జానకి, రామా కనిపించరు.
ఇంతలో వైజయంతి.. జ్ఞానాంబను చూసి ఇక్కడికి వచ్చావు ఏంటి.. అని అడుగుతుంది. నా కొడుకు, కోడలు వచ్చారని తెలిసింది అని అంటుంది. నేను సాయంత్రం నుంచి ఇక్కడే ఉన్నా.. నాకు కనిపించలేదు. ఎవరిని చూసి ఎవరు అని అనుకున్నావో.. అని అంటుంది వైజయంతి.
ఇక.. మీకు ఈరోజు మా గ్రాడ్యుయేషన్ డే అని ఎలా తెలుసు అని అడుగుతుంది జానకి. చెప్పాల్సిందే.. అని అడుగుతుంది. చెప్తావా? లేకపోతే నేను రాను.. అంటుంది. అప్పుడే ఏదో చెబుతాడు కానీ.. వాయిస్ రాకుండా చేస్తాడు. ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది.
ఒక అమ్మాయి రామా షాపుకు వస్తుంది. ఇంతలో తనకు ఫోన్ వస్తుంది. సారీ నేను రాలేను.. ఈరోజు మా గ్రాడ్యుయేషన్ డే ఉంది. నాకు కుదరదు. అని అంటుంది.. అలా రామాకు తెలిసి.. వెంటనే జానకిని కాలేజీని తీసుకొస్తాడు. నువ్వు నా బంగారం అంటుంది జానకి. మీరు డిగ్రీ పట్టా తీసుకుంటున్నప్పుడు నా ఆనందాన్న అక్కడే చెప్పాలనుకున్నాను అండి. కానీ.. అందరూ ఉన్నారని ఆగిపోయాను. కానీ.. ఇప్పుడు చెప్పకుండా ఉండలేను.. అని చెప్పి.. తన చుట్టూ తిరుగుతాడు రామా. మీరే చూస్తారు కదా.. అంటూ తనను పైకి ఎత్తి తిప్పుతాడు.
ఇక.. జ్ఞానాంబ.. రామా, జానకి అక్కడికి రాలేదని ఇంటికి వెళ్లిపోతుంది. ఇక.. జానకి కూడా నా ఆనందాన్ని మీకు చెప్పాలి కదా అంటుంది. దీంతో చెప్పండి అంటాడు రామా. అటు తిరగండి.. కళ్లు మూసుకోండి అని చెప్పి.. రామాకు బుగ్గ మీద ఒక ముద్దు ఇస్తుంది. అంతే.. రామా ఫ్లాట్ అయిపోతాడు.
కట్ చేస్తే.. మల్లిక.. ఖార్ఖానాకు వచ్చేసింది. ఆ పోలేరమ్మ నన్ను అస్సలు వదలడం లేదు.. అని అంటూ వచ్చి తలుపు గడియ పెట్టి.. జానకి.. జానకి అని పిలుస్తుంది. చూస్తూ జానకి కనిపించదు. ఎక్కడికి వెళ్లిందని అటూ ఇటూ చూస్తుంది. ఇద్దరూ కలిసి సరదాగా సినిమాకో, షికారుకో వెళ్లిఉంటారా? అని షాపునకు ఫోన్ చేస్తుంది. బావ గారికి ఫోన్ ఇవ్వు అనగానే.. అక్కడ పనిచేసే వ్యక్తి రామచంద్రగారు లేరు.. బయటికి వెళ్లారు అని చెప్తాడు. దీంతో ఆహా.. ఇద్దరు కలిసి ఊరేగడానికి వెళ్లారా? అని అనుకుంటుంది మల్లిక. వెంటనే పోలేరమ్మకు ఫోన్ చేసి ఖార్ఖానాకు పిలిపిస్తుంది. ఇంతలోనే జానకి, రామా అక్కడికి వస్తారు. తలుపును జ్ఞానాంబ తీస్తుంది. జ్ఞానాంబను చూసి ఇద్దరూ షాక్ అవుతారు.
రామా ఏదో చెప్పబోతుంటే.. నువ్వు చెప్పడం అయిపోయింది. ఇక నేను మీకు చెప్పడమే మిగిలి ఉంది.. అని అంటుంది. ఉదయాన్నే మీరు ఇంటికి రండి. నా నిర్ణయం ఏంటో మీకే తెలుస్తుంది.. అని చెప్పి ఖార్ఖానా నుంచి జ్ఞానాంబ వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే బుధవారం ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.