
Jr Ntr to attend bjp munugodu meeting with Amit Shah
Jr NTR : బీజేపీ మునుగోడు సభ ఇవాళే అని తెలుసు కదా. ఈ సభకు బీజేపీ ముఖ్య నేతలంతా తరలి వస్తున్నారు. ఈనేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఒక న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. మనుగోడు సభకు జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం అందిందట. అవును.. అసలు బీజేపీకి, జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధమే లేదు. మునుగోడుతోనూ జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదు. కానీ.. అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కానున్నారనే వార్తలు ప్రస్తుతం గుప్పుమంటున్నాయి. నిజానికి.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు ముఖ్యనేతలు ఇవాళ మునుగోడులో జరగబోయే సభకు హాజరయ్యారు. కానీ.. జూనియర్ ఎన్టీఆర్ తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారట అమిత్ షా.
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఎన్టీఆర్ నటనను అందరూ మెచ్చుకుంటున్నారు. ఆస్కార్ కు కూడా జూనియర్ ఎన్టీఆర్ నామినేట్ అయ్యారు.. ఎన్టీఆర్ నటన నచ్చి.. అమిత్ షా హైదరాబాద్ లో జూనియర్ ఎన్టీఆర్ తో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. అందుకే ప్రత్యేకమైన డిన్నర్ మీట్ కు జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించినట్టు తెలుస్తోంది.
Jr Ntr to attend bjp munugodu meeting with Amit Shah
కానీ.. అదంతా కాదు.. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా సమావేశం కానున్నారని వార్తలు వస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో అధికారం కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా సమావేశం అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్, అమిత్ షా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. భేటీ తర్వాత అసలు వీళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియనుంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.