
junior ntr look as komaram bheem in rrr movie
RRR : ఆర్ఆర్ఆర్ మూవీ.. ప్రస్తుతం అందరి దృష్టి ఈ సినిమా మీదనే ఉంది. బాహుబలి సిరీస్ తర్వాత జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమాపై కేవలం తెలుగు సినిమా అభిమానులే కాదు.. యావత్ దేశమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే.. కొమరంభీమ్, అల్లూరి సీతారామరాజులకు సంబంధించిన టీజర్లను సినీ అభిమానుల కోసం వదిలారు జక్కన్న. ప్రస్తుతం కరోనా వల్ల సినిమా విడుదల లేట్ అవుతోంది. అయితే.. ఈనేపథ్యంలో సినీ అభిమానులను అలరించడం కోసం.. మే 20న అంటే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా.. ఎన్టీఆర్ అభిమానులకు అధిరిపోయే కానుకను అందించాడు రాజమౌళి.
junior ntr look as komaram bheem in rrr movie
ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయిన ఇద్దరు గొప్ప వ్యక్తుల కథ. ఒకరు తెలంగాణకు చెందిన కొమరం భీమ్ అయితే.. ఇంకొకరు ఏపీకి చెందిన అల్లూరి సీతారామరాజు. నిజానికి.. వీళ్లిద్దరూ నిజంగా కలుసుకోలేదు. కానీ.. వీళ్లిద్దరూ కలుసుకొని.. ఆదివాసీల కోసం, పేదల ప్రజల హక్కుల కోసం పోరాటం జరిపితే ఎలా ఉంటుంది.. అన్న కాన్సెప్ట్ తో కల్పిత కథతో వస్తున్న సినిమా ఇది.
తాజాగా తారక్ పుట్టిన రోజు సందర్భంగా కొమరం భీమ్ కు సంబంధించిన కొత్త పోస్టర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి ఆ పోస్టర్ ను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. కొమరం భీమ్ కు ఏమాత్రం తీసిపోకుండా.. బల్లెం విసురుతూ.. కనిపించారు ఎన్టీఆర్. ఇక.. కరోనా కారణంగా ప్రస్తుతం సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే.. సినిమాకు ఈ దసరాకు కానుకగా విడుదల చేస్తామని మూవీ మేకర్స్ ప్రకటించినా.. కరోనా వల్ల సినిమా విడుదల ఆసల్యం అయ్యే అవకాశం ఉంది. ఇక.. ఈ సినిమాలో తారక్ కు జోడిగా.. హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటిస్తోంది. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్ కు జోడిగా బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తోన్న విషయం తెలిసిందే.
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
Protein Food : ప్రస్తుతం ఫిట్‌నెస్, వెయిట్ లాస్, మసిల్ బిల్డింగ్‌పై ఆసక్తి పెరగడంతో ప్రోటీన్ గురించి అవగాహన కూడా…
Snakes : ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలోనూ పాములు కనిపిస్తాయి. అడవులు, పర్వతాలు, ఎడారులు, గ్రామాలు ఇలా ఎక్కడైనా వాటి…
Watermelon vs Muskmelon : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో పుచ్చకాయలు, ఖర్బూజాలు కనిపించడం మొదలవుతుంది. శరీరానికి చల్లదనం…
Apple Cider Vinegar : ఇటీవల కాలంలో బరువు తగ్గేందుకు చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV)ను తమ డైట్‌లో…
Migraine : రోజంతా మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ స్క్రీన్‌ల ముందే గడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉద్యోగం, చదువు,…
Tea : భారతీయ కుటుంబాల్లో టీకి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం నిద్రలేవగానే ఒక…
This website uses cookies.