
Junior NTR – Pawan Kalyan : ఏపీలో ప్రస్తుతం జనసేన పార్టీ గ్రాఫ్ విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు అంటే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి వచ్చిన సీటు ఒకటే. ఆ ఒక్క సీటు కూడా ఇప్పుడు లేదు. అంటే.. ప్రస్తుతానికి జనసేన జీరో అన్నమాట. కానీ.. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు పెడితే జనసేన ఖచ్చితంగా కొన్ని సీట్లను అయితే గెలుచుకుంటుంది. ఎందుకంటే.. ఇప్పటి వరకు చంద్రబాబుకు చాన్స్ ఇచ్చారు.. జగన్ కు చాన్స్ ఇచ్చారు. ఇక ఒక్కసారి పవన్ కళ్యాణ్ కు చాన్స్ ఇచ్చి చూద్దామని జనాలు అనుకుంటున్నారు. ఈనేపథ్యంలో వచ్చే ఎన్నికలలోపు జనసేన బాగానే పుంజుకునే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కు సామాన్య జనాలే కాదు..
ప్రముఖులు కూడా మద్దతు తెలుపుతున్నారు. చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్ ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉందంటున్నారు. మరోవైపు ప్రజా సమస్యలే అజెండాగా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. చాలామంది రాజకీయ నాయకులు ప్రజల డబ్బునే ప్రజలకు పంచుతారు. కానీ.. పవన్ కళ్యాణ్ మాత్రం తాను సంపాదించిన డబ్బును ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు పంచుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్.. పార్టీని నడిపించడం కోసం, ఇతర ఖర్చుల కోసం సినిమాల ద్వారా వచ్చిన ఆదాయంతో పాటు తన ఆస్తులను కూడా అమ్ముతున్నట్టు తెలుస్తోంది.
junior ntr talks about pawan kalyan
నిజానికి సినిమాల ద్వారా ఎంతో సంపాదించుకునే అవకాశం పవన్ కళ్యాణ్ కు ఉంది. కానీ.. దాన్ని వినియోగించుకోకుండా కేవలం తన పార్టీని నడపడం కోసం మాత్రమే సినిమాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవను, ఆయన పోరాడుతున్న తీరును చూసి చాలామంది మెచ్చుకుంటున్నారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల కోసం, వాటి పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నారని, అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏపీ ప్రజలకు మంచి జరుగుతుందని ఇటీవల అన్నారట. ఈ విషయమే ప్రస్తుతం ఫిలిం నగర్ లో చర్చనీయాంశం అయింది. అసలు ఎన్టీఆర్ నే రాజకీయాల్లోకి రావాలని అందరూ పిలుస్తున్నారు. టీడీపీని టేకోవర్ చేసుకోవాలంటున్నారు. ఈనేపథ్యంలో ఆయన పవన్ కళ్యాణ్ సీఎం కావాలని చెప్పడం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశం అయింది.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.