Karthika Deepam 19 Aug Today Episode : కార్తీక దీపం 19 ఆగస్టు 2021, గురువారం లేటెస్ట్ ఎపిసోడ్ 1122 తాజాగా రిలీజ్ అయింది. తాజా ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం. ఎలా ఉంది నా ప్లాన్. అదిరిపోయింది కదా. నేను చంపకుండా మోనిత ఎలా చచ్చిపోయింది అని తల బద్ధలు కొట్టుకుంటున్నవు కదా. ఇదంతా నేను నీ మీద తీసుకుంటున్న ప్రతీకారం అనుకుంటున్నావా? కాదు.. నీ భార్య దీప మీద తీసుకుంటున్న ప్రతీకారం. నువ్వు అన్నావు కదా. నన్ను చంపి నీ భార్యను ఒంటరిని చేయలేను అన్నావు కదా. అందుకే.. నేను చచ్చిపోయాను. నిన్ను సొంతం చేసుకునేదాకా వదలను. నువ్వు జైలు నుంచి వచ్చేలోపు నేను నీ భార్యను అడ్డు తొలగిస్తాను. నువ్వు ఎప్పటికీ దీపతో కాపురం చేయకూడదు. ఇక నుంచి నీ భార్య అడ్డుతొలగించే ప్రయత్నంలో ఉంటాను బాస్. సారీ.. నిన్ను కష్టపెట్టక తప్పడం లేదు.. అంటూ కార్తీక్ ఫోటోను హత్తుకుంటుంది మోనిత.
కట్ చేస్తే దీప, పిల్లలు శౌర్య, హిమ.. పోలీస్ స్టేషన్ కు కార్తీక్ ను చూడటానికి వస్తారు. డాక్టర్ బాబును చూసి వెక్కి వెక్కి ఏడుస్తారు. ఏంటి నాన్నా ఇది. నువ్వేంటి నాన్నా ఇక్కడ. బెడ్ కూడా లేదా? ఏసీ కూడా ఉండదా? ఫ్యానే లేదు. ఎలా ఉంటున్నావు డాడీ. దోమలు కుట్టడం లేదా? నిద్ర ఎలా పడుతుంది నాన్నా. ఇలా లోపలే ఉండాలా ఎప్పుడూ. ఎందుకు డాడీ ఇలా గదిలో పెట్టి తాళం వేశారు. నువ్వేమైనా దొంగవా? ఎందుకిలా తాళం వేశారు. నువ్వు పెద్ద డాక్టర్ వని వీళ్లకు చెప్పలేదా? బస్తీలో క్లీనిక్ పెట్టి అందరికీ ఫ్రీగా వైద్యం చేస్తావని తెలియదేమో వీళ్లకు. అంత మంచివాడివి కదా డాడీ. ఈ గదిలో పెట్టి ఎందుకు నిన్ను లాక్ చేశారు.. అంటూ పిల్లలు ప్రశ్నిస్తారు.
నన్ను ఇలా చూస్తూ వీళ్లు తట్టుకోలేరు అని తెలియదా దీప. ఎందుకు తీసుకొచ్చావు.. అని డాక్టర్ బాబు దీపను అడుగుతాడు. దీంతో వాళ్లు ఒట్టు పెట్టుకున్నారు డాక్టర్ బాబు.. అందుకే తప్పలేదు.. అంటుంది దీప. వీళ్లు తాళం తీసి నిన్ను బయటికి రానివ్వరా? అంటూ అడుగుతారు. వెళ్లి పోలీస్ ను అడుగుతారు. మా నాన్నకు టిఫిన్ తినిపించడానికి వచ్చాను. ప్లీజ్.. మా నాన్న ఇక్కడే కూర్చొని టిఫిన్ తింటాడు.. అని చెప్పి బతిమిలాడగా… హెడ్ కానిస్టేబుల్ రత్నసీత.. సెల్ తాళం తీసి కార్తీక్ ను బయటకు తీసుకొస్తుంది. దీంతో.. ఇద్దరు పిల్లలను డాక్టర్ బాబును హత్తుకుంటాడు.
రండి.. మీ కోసం టిఫిన్ తీసుకొచ్చాను. రా డాడీ.. అంటారు పిల్లలు, దీప. అక్కడే ఉన్న టేబుల్ మీద కూర్చొని టిఫిన్ చేస్తుంటాడు డాక్టర్ బాబు. నువ్వు ఇక్కడుండటం నాకు నచ్చలేదు.. అని శౌర్య చెప్పి.. అక్క మా నాన్నను ఇంటికి తీసుకెళ్లి.. రేపు తీసుకొస్తాం… పంపించవా? అని రత్నసీతను అడుగుతుంది. దీంతో వీలు కాదు అమ్మా. అలా బయటికి పంపించకూడదు.. అంటుంది రత్నసీత. దీంతో ఎందుకు.. మా నాన్న ఏం తప్పు చేశాడు? అంటూ ప్రశ్నిస్తుంది. మా నాన్న చాలా మంచివాడు. అంత తప్పేం చేశాడు.. అని శౌర్య అడుగుతుంది. అస్సలు వినదు. దీంతో కోపంతో శౌర్యను దీప లాక్కొచ్చేస్తుంది. రౌడీ.. ఉన్న కాసేపు ఈ ఏడుపు పెడబొబ్బులు ఎందుకు? కాసేపు నాతో మాట్లాడొచ్చు కదా.. అని డాక్టర్ బాబు అనేసరికి.. శౌర్య సరే అంటుంది.
అక్కడ ఉన్నారు కదా.. వాళ్లు లోపల ఉండాలి. కానీ.. నిన్నెందుకు లోపల పెట్టారు. అసలు ఎప్పుడు నిన్ను వదిలిపెడతారు. నానమ్మ నిన్ను ఇక్కడ చూసిందా? చూసి కూడా అలాగే ఊరుకుందా? భయంగా ఉంది. డాడీ మనతో ఉండకుండా.. ఇక్కడ ఉంటే ఎలాగమ్మా. ఎప్పుడు వస్తారంటే ఎవ్వరూ చెప్పడం లేదు.. అని ఏడుస్తారు పిల్లలు.
వస్తారమ్మా… తప్పకుండా వస్తారు.. అత్తమ్మ లాయర్ ను కలిసి బెయిల్ కోసం వస్తారని చెప్పారు. ఎన్ని ప్రశ్నలు వేసినా వేస్ట్. కానీ.. అమ్మ ఏడుస్తూనే ఉంటుంది. ఇంతమంది ఉన్నారు కానీ.. నాన్నను బయటికి మాత్రం తీసుకురావడం లేదు. ఇక.. మీరు ఆపుతారా? ముందు ఆయన్ను తిననివ్వండి… అంటుంది దీప.
కార్తీక్ ముద్ద నోట్లో పెట్టుకోబోగానే.. రత్నసీత.. ఏంటిది.. స్టేషన్ అనుకుంటున్నారా? క్యాంటిన్ అనుకుంటున్నారా? ఎవరిని ఎక్కడ ఉంచాలో.. అక్కడ ఉంచాలని తెలియదా? అందరినీ రానిచ్చి స్టేషన్ ను పిక్ నిక్ స్పాట్ చేశారా? సారీ మేడమ్.. నేనే తాళం తీశాను.. అని ఏసీపీకి చెబుతుంది రత్నసీత. సారీ మేడమ్ ఆ అమ్మాయి తప్పు లేదు.. మేమే.. అనేసరికి.. రత్నసీతకు సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. నీ డ్యూటీ నువ్వు చెయ్.. ఇక్కడ సెంటిమెంట్స్ కు తావు లేదు.. క్షణాల్లో ఇదంతా క్లియర్ కావాలి.. అని ఏసీపీ మేడమ్ అంటుంది.
నేను ఈ మేడమ్ లాగా అందరినీ కమాండ్ చేయాలంటే ఏం చేయాలి నాన్నా.. అని అడుగుతుంది శౌర్య. దీంతో ఐపీఎస్ అవ్వాలి.. అని చెబుతాడు డాక్టర్ బాబు. దీంతో నేను ఐఏఎస్ కావాలనుకున్నాను కదా. కానీ.. ఐపీఎస్ అవుతాను నాన్నా.. అంటుంది శౌర్య. వెళ్లి చదువుకో. ఐపీఎస్ కాదు.. ఏదైనా అవ్వొచ్చు.. అంటూ చెప్పి ఏసీపీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
కూర్చో నాన్నా.. తిను నాన్నా.. అని పిల్లలు అనేసరికి.. కార్తీక్ అప్పుడు టిఫిన్ చేస్తాడు. ప్లేట్ కడగడానికి దీప లోపలికి వెళ్తుంది. ఇంతలో కార్తీక్ ను రత్నసీత లోపల వేసి తాళం వేస్తుంది. వద్దు డాడీ.. వద్దు.. వెళ్లొద్దు.. అంటూ పిల్లలు ఏడుస్తుంటారు. నాన్నా.. అంటూ మళ్లీ గుక్కపెట్టి ఏడుస్తుంటారు. దీప.. పిల్లలను తీసుకొని బయటికి వెళ్తుండగానే.. తన పిన్నీ ఫోన్ చేసి… గుడికి వెళ్తున్నాం.. రా అని చెబుతుంది. ఆ విషయాన్ని రత్నసీత వింటుంది.
కట్ చేస్తే సౌందర్య, తన భర్త.. ఇద్దరూ ఫోన్లలో బబిజీగా ఉంటారు. ఎవరితోనే మాట్లాడుతుంటారు. ఓకే.. అని చెప్పి ఇద్దరూ ఫోన్ పెట్టేస్తారు. ఎవరికి చేశారు.. అని సౌందర్య అడగగా.. నువ్వెవరికి చేశావు.. అంటారు. అడ్వకేట్ తో మాట్లాడాను.. అని చెబుతుంది సౌందర్య. ఇంతలో దీప.. సౌందర్యకు ఫోన్ చేస్తుంది. రోషిణి.. కార్తీక్ ను చాలా ఛీప్ గా చూస్తోందని దీప ఫోన్ లో చెబుతుంది.
కట్ చేస్తే.. మోనిత.. పోలేరమ్మలా రెడీ అవుతుంది. ముఖానికి పసుపు పూసుకుంటుంది. ఓ బుట్ట పట్టుకొని.. ఆ బుట్టలో గన్ పెట్టుకొని బయలుదేరుతుంది. కారు ఎక్కుతుంది. కారు డ్రైవర్.. తనను చూసి.. మేడమ్.. మీరు ఆర్టిస్టా? అని అడుగుతాడు. కాదు.. డ్రామా ఆర్టిస్టును అంటుంది మోనిత.
ఇప్పుడు ఏ డ్రామా వేయడానికి వెళ్తున్నారు మేడమ్.. అని అడగగానే.. ఒక దీపం ఆరిపోయింది.. అంటుంది మోనిత. ఇంతలోనే సీరియల్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? మోనిత.. దీపను చంపుతుందా? అనే విషయం తెలియాలంటే మాత్రం శుక్రవారం ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.