Karthika Deepam 25 Aug Today Episode : కార్తీక దీపం 25 ఆగస్టు 2021, బుధవారం లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా రిలీజ్ అయింది. 1127 ఫుల్ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీపను చంపాలని తెగ ప్రయత్నించి విఫలం అవుతుంది మోనిత. అయితే.. తను సోది చెప్పేది కాదని.. తనే మోనిత అని దీప గుర్తిస్తుంది. కానీ.. దీప చెప్పే విషయాన్ని ఎవ్వరూ నమ్మరు.
దీపను గన్ తో కాల్చుదామని అనుకునేసరికి.. తుమ్ము రావడం.. ఆ తర్వాత తన ముసుగు తొలగిపోవడం.. అదే సమయంలో దుర్గ అక్కడికి రావడంతో.. వెంటనే మోనిత అక్కడి నుంచి పారిపోతుంది. పారిపోయి.. తను తలదాచుకుంటున్న రూమ్ కు వచ్చేస్తుంది. తెగ టెన్షన్ పడుతుంది.
కొద్దిలో ఎంత ప్రమాదం తప్పింది. లేదంటే కార్తీక్ కోసం నేనే చేసే ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయి ఉండేది. ఇక నేను జాగ్రత్తగా ఉండాలి. కానీ.. ఎలా? దీపను దాటుకొని కార్తీక్ ను చేరుకోవడం కష్టం అవుతోంది. నా చేతికి మట్టి అంటకుండా.. కార్తీక్ ను నావాడిని చేసుకోవాలి.. అని అనుకుంటుంది మోనిత.
కట్ చేస్తే.. పిల్లలు తెగ టెన్షన్ పడుతుంటారు. ఇంతలో సౌందర్య వచ్చి.. ఏంటి.. అలా కూర్చున్నారు. ఏం తినకుండా ఎంత సేపు అలా కూర్చుంటారు. రండి.. టిఫిన్ చేద్దురు కానీ.. అంటూ అడుగుతుంది సౌందర్య. ఏం జవాబు చెప్పరు ఏంటి అని సౌందర్య అంటే.. నేను అడిగిన దానికి మీరు సమాధానం చెబుతున్నారా? మా నాన్నను పోలీస్ స్టేషన్ లో ఎందుకు ఉంచారు? ఎప్పుడు వస్తారు నాన్న. అసలు వస్తారా? రారా? అంటూ ఏవేవో పిచ్చి ప్రశ్నలు వేస్తారు. దీంతో అప్పుడే దీప అక్కడికి వస్తుంటుంది. ఈ ప్రశ్నలు నన్ను కాదు.. మీ అమ్మను అడగండి.. అంటుంది సౌందర్య.
దీంతో తన దగ్గరికి వెళ్తారు పిల్లలు. అమ్మ.. ఇవాళైనా చెప్పమ్మా. నిజం చెప్పాలి. డాడీ ఎప్పుడొస్తాడు. అసలు.. పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు. ఎప్పుడు వస్తాడు. చెప్పమ్మా.. చెప్పవేంటమ్మా.. అనగానే.. ఆపండి.. అంటూ గట్టిగా అరుస్తుంది దీప.
దీప అరుపులు విని.. ఇంట్లో ఉన్నవాళ్లు అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. ఎందుకో తీసుకెళ్లారు. ఎప్పుడో తీసుకొస్తారు మీకెందుకు. కనబడితే చాలు.. ఒకటే ప్రశ్నలు. నా చావు నేను చస్తుంటే.. మీ గోలేంటి. అన్నీ మీకు చెప్పి చావాలా? అనగానే.. శౌర్య చెప్పాలి.. అని గట్టిగా అరుస్తుంది.
ఎందుకు చెప్పాలి? అని అడుగుతుంది దీప. ఆయన మా నాన్న కాబట్టి చెప్పాలి. పొద్దున్నే వెళ్లావు.. ఎవ్వరికీ చెప్పలేదు. మమ్మల్ని లేపలేదు. నీతో తీసుకెళ్లొచ్చు కదా. తీసుకెళ్లవు. ఎక్కడికి వెళ్లావు అని అడిగితే చెప్పవు. ఇలాగే అన్నీ దాచిపెట్టి.. చివరకు మా నాన్నను పోలీసులు తీసుకెళ్లేలా చేశావు.. అని శౌర్య తన తల్లి దీపనే ప్రశ్నిస్తుంది.
అత్తమ్మ… ఏంటి అలా మాట్లాడుతున్నవు అని దీప అంటుంది. ఏంటే.. ఏం మాట్లాడుతున్నావు.. చిన్నాపెద్దా తేడా లేకుండా.. అని సౌందర్య కూడా బెదిరిస్తుంది. మీకు చెప్పకుండా మేము ఎక్కడికైనా వెళ్తున్నామా? మా నాన్న చాలా మంచివాడు. మమ్మల్ని చాలా బాగా చూసుకుంటాడు. మీలాగా ఎప్పుడూ కసురుకోడు. ఈవిడ లాగా మా మీద అరవడు. మీ అందరికీ మా నాన్న అక్కర్లేదు. ఆయన్ని పోలీసులు తీసుకెళ్తే మీరంతా హ్యాపీగా ఇంట్లో కూర్చుంటారు. మా నాన్న ఎక్కడో ఉంటే.. మేం ఇక్కడ ఎలా ఉండాలి. మాకు చూడాలనిపించదా? మాట్లాడాలనిపించదా? అక్కడ ఏసీ లేదు. ఫ్యాన్ లేదు. బెడ్ లేదు. కింద పడుకోవాలి. బయటికొచ్చి టిఫిన్ చేసినా ఊరుకోరు. ఆ పెద్దపోలీస్ ఆవిడా.. పోలీస్ స్టేషనా? క్యాంటీనా? అని తిడుతుంది. గదిలో పెట్టి తాళం వేయమంటుంది. మా నాన్న డాక్టర్.. దొంగ కాదు.. అని అంటుంది శౌర్య.
ఆయనెందుకు అక్కడ ఉండాలి. మీకెన్ని డబ్బులు ఉన్నాయి కదా. వెళ్లి విడిపించుకురావచ్చు కదా. ఇంకా ఈవిడ అయితే.. మాతో మాట్లాడనే మాట్లాడదు. మమ్మల్ని అస్సలు పట్టించుకోదు. ఇంట్లోనే సరిగ్గా ఉండదు. తీసుకెళ్లి మానాన్నను చూపించదు. మా డాడీ గురించి అడిగితే అరుస్తుంది. ఎందుకు అరవాలి. మేమేం తప్పు చేశాం. డాడీ కావాలని అడగడం తప్పా? మీరు కూడా మమ్మల్నే అంటారేంటి. మా నాన్న ఒక్కడే పోలీస్ స్టేషన్ లో ఎంత బాధపడుతున్నాడో తెలుసా? వద్దులే హిమ. వీళ్లు అరుస్తారు. ఏదైనా అడిగితే మాత్రం చెప్పరు. వీళ్లందరూ ఒక్కటే. వీళ్లకి మన నాన్న అక్కర్లేదు. రా.. వీళ్లతో మాట్లాడేదేంటి.. అంటూ హిమను తీసుకొని… శౌర్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
తన పిల్లల మాటలు విని.. దీప అక్కడే ఏడుస్తూ కుప్పకూలుతుంది. చివరకు తన సొంత పిల్లలు కూడా తననే తప్పు పడుతున్నారంటూ తెగ బాధపడుతుంది.
కట్ చేస్తే.. స్నానం చేసి మోనిత రెడీ అవుతుంది. మళ్లీ ఏదో ప్లాన్ చేసినట్టుంది. అందుకే.. చక్కగా రెడీ అవుతుంది. ఎస్.. ఇంతకు ముందు ఆవేశంలో నేను తీసుకున్న నిర్ణయం వల్ల.. దీప చస్తుంది. కానీ.. నేనే చేసే తప్పు వల్ల అది సాక్ష్యం అవుతుంది. అప్పుడు నేను జైలుకి.. కార్తీక్ బయటికి వస్తాడు. ఇద్దరం ఒంటరిగా ఉండిపోతాం. అందుకే దీప అడ్డులేకుండా నేను, కార్తీక్ హాయిగా ఉండొచ్చు. ప్లాన్ ఏ ఫెయిల్ అయితేనేం.. ప్లాన్ బీ ఉందిగా.. అని వెంటనే రత్నసీతకు ఫోన్ చేస్తుంది మోనిత.
నాకు ఇందాక తలస్నానం చేసేటప్పుడు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. అదేంటంటే.. అంటూ ఫోన్ లో ఏదో చెబుతుంది. అది రిస్క్ ఏమో మేడం అంటుంది. నాకార్తీక్ తో కలిసి ఉండటం కోసం నేను చావకుండా ఏం చేయమన్నా.. ఎంత రిస్క్ అయినా చేస్తా. నేను చచ్చే ఆ వంటలక్క కార్తీక్ తో ఉంటుంది కదా.
అందుకే నేను బతికే ఉండి.. నా కార్తీక్ తో కలిసి ఉండి ఆ వంటలక్కను కార్తీక్ కు దూరం చేస్తాను. నువ్వయితే నేను చెప్పింది చేయి.. అని చెప్పి కార్తీక్ ఫోటో తదేకంగా చూస్తుంది మోనిత. నేను ఏం చేసినా.. మనం సంతోషంగా కలిసి ఉండటం కోసమే బంగారం. ఐలవ్యూరా.. అని కార్తీక్ ఫోటోకు చెప్పి.. ఫోటోకు ముద్దు పెట్టి.. హత్తుకుంటుంది మోనిత.
కట్ చేస్తే.. పోలీస్ స్టేషన్ లో సెల్ లో దీనంగా ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. రత్నసీత.. కార్తీక్ ను చూసి ఆయన దగ్గరికి వెళ్లి డాక్టర్ సార్.. ఏంటి సార్.. అలా ఉన్నారు.. అని అడుగుతుంది. ఏం లేదు.. మీ హస్ బెండ్ ఎలా ఉన్నాడు రత్నసీత. మందులు సరిగ్గా వాడుతున్నాడా? ఏదైనా అవసరం ఉంటే చెప్పు. నేను ఏ హెల్ప్ అయినా చేస్తాను.. అని అంటాడు.
వజ్రం ఎక్కడున్నా వజ్రమే డాక్టర్ సాబ్. ఈ సమయంలో కూడా మీరు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు అంటే మీరు గ్రేట్ సార్.. అని అంటుంది రత్నసీత. కాసేపట్లో మేడం మిమ్మల్ని పిలుస్తారు. ఇంటరాగేషన్ కాస్త గట్టిగానే ఉండనుంది. థర్డ్ డిగ్రీ లాంటిది ఏం ఉండదు కానీ.. కానిస్టేబుల్స్ లాఠీలతో కొడితే కొట్టొచ్చు. బయట టీ చెప్పాను. టీ కొట్టు కూతురు వచ్చి మీకు టీ ఇస్తుంది అని చెప్పి వెళ్తుంది రత్నసీత.
కట్ చేస్తే.. భాగ్య పోలీస్ స్టేషన్ కు వచ్చి ఏసీపీ రోషిణి కాళ్లను పట్టుకొని.. అమ్మా.. అమ్మా.. కార్తీక్ బాబు ఏం తప్పు చేయలేదమ్మా.. నేను కార్తీక్, మోనిత గొడవ పెట్టుకోవడం చూశా. కానీ.. కార్తీక్.. మోనితను చంపడం నేను చూడలేదు.. అంటూ చెబుతుంది భాగ్య. నా అల్లుడిని విడిపించండి అమ్మా.. మీ కాళ్లు పట్టుకుంటాను.. అని అంటుంది. ఇంతలో రత్నసీత.. రత్నసీత అంటూ ఏసీపీ పిలుస్తుంది. ఈ అక్కను బయటికి పంపించు.. అని చెప్పి వెళ్లిపోతుంది.
కట్ చేస్తే.. దీప ఇంట్లో దిగాలుగా కూర్చొని ఏడుస్తుంటుంది. కార్తీక్ తండ్రి చూసి దీప.. ఒంటరిగా కూర్చున్నావు. ఏమైంది.. అని అడుగుతుంది. వాడి గురించేనా.. అని అంటుంది. అవును.. మామయ్య గారు.. అంటే ఎందుకు అని అడుగుతాడు. నిజం చెప్పమంటూ పోలీసులు ఆయన మీద చేయి చేసుకుంటారేమో.. ఆయన అబద్ధం చెప్పరు.. ఆయన నిజమే చెబుతారు.. ఎలాగో అంటూ టెన్షన్ పడుతుంది దీప. అక్కడ పరిస్థితి వేరుగా ఉంది మామయ్య గారు.
ఆయన డాక్టర్ అని కూడా చూడకుండా.. చాలా దారుణంగా చూస్తున్నారు.. అని దీప అనగానే.. నేను వాడిని ఆ దుస్థితిలో చూడలేకనే వాడిని చూసేందుకు వెళ్లడం లేదు. అయినా.. నేను అడ్వకేట్స్ తో మాట్లాడుతున్నా. నువ్వు ధైర్యంగా ఉండు.. అంటాడు. ఆ రోషిణి చాలా కఠినంగా మాట్లాడుతోంది మామయ్య. ఆమె మనసు కరగడం లేదు.. అంటుంది.
కట్ చేస్తే.. మోనిత ప్లాన్ బీ ప్రకారం.. పోలీస్ స్టేషన్ కు వెళ్లి కార్తీక్ కు చాయ్ ఇస్తుంది. అదే సమయంలో దీప కూడా అక్కడికి వచ్చి కార్తీక్ తో మాట్లాడుతుంటుంది. మోనితను చూశానని.. ఎలాగైనా మోనితను పట్టుకొని మిమ్మల్ని బయటికి తీసుకొస్తానని చెబుతుంది. ఇంతలో మోనిత.. చాయ్ తీసుకొచ్చి కార్తీక్ కు ఇస్తుంది.
కావాలని కార్తీక్ చేతివేళ్లను టచ్ చేస్తుంది. ఆ స్పర్శ చూసి ఇది ఖచ్చితంగా మోనిత స్పర్శే అని అనుకుంటాడు. చాయ్ ఇచ్చి మోనిత వెళ్తూ.. అమ్మా.. అని ఒక్కసారిగా అరుస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో గురువారం ఎపిసోడ్ లో చూడాల్సిందే.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.