Home » Entertainment » Karthika Deepam 6 August 2021 Episode 1111 Highlights
Entertainment

Karthika Deepam Today Episode : అసలు విషయం తెలుసుకొని.. మోనితను చంపడానికి బయలుదేరిన కార్తీక్.. ఆ తర్వాత ఏం జరిగింది? మోనితను కార్తీక్ చంపేశాడా?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: August 6, 2021 9:37 am
Advertisement

Karthika Deepam Today Episode : కార్తీక దీపం 6 ఆగస్టు 2021, శుక్రవారం 1111 ఎపిసోడ్ తాజాగా రిలీజ్ అయింది. లేటెస్ట్ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. భాగ్య… మోనిత ఇంటికి వెళ్లి.. మోనిత పెళ్లి ఆపడానికి ట్రై చేస్తుంది. మోనితను తన ఇంటికి తీసుకెళ్లి అక్కడ రూమ్ లో వేసి బంధించాలనుకుంటుంది. కానీ.. తన ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది. భాగ్య.. ఎందుకు తన ఇంటికి వచ్చిందో తెలుసుకున్న మోనిత.. భాగ్యను ఒక రూమ్ కు తీసుకెళ్లి అక్కడ ఒక కర్రతో తల మీద బాదుతుంది. కుర్చీలో కూర్చున్న భాగ్య చేతులను, కాళ్లను వెంటనే కట్టేసి.. నోటికి ప్లాస్టర్ వేస్తుంది. ఏం చేస్తున్నావు.. అంటూ గట్టిగా అరుస్తుంది భాగ్య. ఏంటి.. ఇది ఇలా చేసింది.. అని అనుకుంటున్నావా… అర్ధపావు భాగ్యం.

Advertisement

karthika deepam 6 august 2021 episode 1111 highlights

ఏం చదువుకోని దానివే నీకు ఇన్ని తెలివి తేటలు ఉంటే.. చదువుకున్నదాన్ని పైగా డాక్టర్ ను నాకు ఎన్ని తెలివి తేటలు ఉండాలి. నువ్వు ఎంత గింజుకున్నా.. నా పెళ్లి కార్తీక్ తో జరుగుతుంది. అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు. బై బంగారం.. అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది మోనిత.

Advertisement

కట్ చేస్తే దీప, కార్తీక్ ఇద్దరూ మోనిత గురించి చర్చించుకుంటారు. నేను ఎంత చెప్పినా తక్కువే. మీరు డైరెక్ట్ గా ఒక ప్రదేశానికి వెళ్లండి. అప్పుడే మీకు అన్నీ క్లియర్ గా అర్థం అవుతాయి. నేను చెప్పి చెప్పి అలసిపోయాను. మీకు అడ్రస్ చెప్పాను కదా. మీరు అక్కడికి వెళ్లండి. అక్కడ ఉన్నవాళ్లే మీకు అన్ని విషయాలు చెబుతారు. వెంటనే అక్కడికి వెళ్లండి.. అని దీప.. కార్తీక్ కు చెబుతుంది.

karthika deepam 6 august 2021 episode 1111 highlights

Advertisement

ఇంతలో భాగ్య భర్త ఇంటికి వచ్చి చూసేసరికి.. తాళం వేసి ఉంటుంది. వెంటనే తనకు ఫోన్ చేస్తాడు. ఈ టైమ్ లో ఎక్కడికి వెళ్లింది అని తెగ టెన్షన్ పడతాడు. ఫోన్ కూడా తను లిఫ్ట్ చేయకపోవడంతో ఎక్కడికి వెళ్లిందని భయపడతాడు. భాగ్య కూడా ఆ ఫోన్ ను చూసి ఎత్తలేక కంగారు పడుతుంది. మళ్లీ స్కూటీ వేసుకొని భాగ్య భర్త అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ మోనిత.. నన్ను కట్టేసినట్టే దీపను కట్టేస్తుందా? ఎలారా దేవుడా? అసలే ఈరోజు 25వ తారీఖు. ఎలా మోనిత నుంచి దీపను కాపాడాలి.. అంటూ తెగ టెన్షన్ పడుతుంది.

కట్ చేస్తే సీన్.. అంజి దగ్గరకు వెళ్తుంది. ద్రాక్షారామం, అంజి మధ్య గొడవ జరుగుతుంది. అసలు.. నువ్వు మా మేడమ్ తో ఎందుకు పెట్టుకున్నావురా.. అంటూ ఇద్దరూ గొడవ పెట్టుకునే సమయానికి కార్తీక్ అక్కడికి వస్తాడు. ఇంతలో ద్రాక్షారామం తల మీద బీరు బాటిల్ తో అంజి దెబ్బ కొట్టి… మోనిత వచ్చిందేమో.. తనను చంపేద్దామన్న కసితో ఉంటాడు అంజి. తీరా చూస్తే అక్కడికి వచ్చింది డాక్టర్ బాబు. డాక్టర్ బాబును చూసి అంజి షాక్ అవుతాడు.

Karthika Deepam Today Episode : అంజి చెప్పిన మాటలు నమ్మని కార్తీక్

కార్తీక్.. వెంటనే అంజిని చూసి ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. వాడెవడు అని అడుగుతాడు. దీంతో.. మోనిత నన్ను ఇక్కడ కట్టిపడేసిందంటాడు. మోనిత.. మీకు తెలియకుండా మీ వెనుక చాలా కుట్రలు చేసింది. అసలు హిమను చంపించిందే.. అంటూ అంజి చెప్పబోయే సరికి కార్తీక్ ఆపి.. ఇదంతా దీప చెప్పమన్నదా? ఇంకా ఎంత కాలం ఇలా కబుర్లు చెబుతావు. నువ్వు చెప్పేది నేను నమ్ముతాననుకుంటున్నావా? ఇకనైనా నువ్వు మారు. నీకు కావాలంటే ఏదైనా సాయం చేస్తాను.. అని చెబుతాడు కార్తీక్. డాక్టర్ బాబు ఒక్క నిమిషం.. మీరు ఎవ్వర్ని నమ్మిన్నా నమ్మకపోయినా.. ఒక్క మోనితను మాత్రం నమ్మకండి.. ప్లీజ్ డాక్టర్ బాబు. కేవలం ఆమె మూలంగానే నా జీవితం ఎటూ కాకుండా పోయింది. మీరు మోనితను నమ్మితే మీ జీవితం కూడా ఎటూ కాకుండా పోతుంది. ఆమె చెప్పేవన్నీ అబద్ధాలు డాక్టర్ బాబు. వెళ్లండి. ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. అంటూ అంజి.. డాక్టర్ బాబుకు చెబుతాడు. దీంతో డాక్టర్ బాబు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

karthika deepam 6 august 2021 episode 1111 highlights

Advertisement

కార్తీక్ అక్కడికి వెళ్లాక.. దీప ఇంట్లో ఉండి టెన్షన్ పడుతుంటుంది. ఇంతలో దీప నాన్న.. దీప ఇంటికి వచ్చి.. మీ పిన్ని ఇక్కడికి వచ్చిందా? అని అడుగుతాడు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. తను ఎక్కడికి వెళ్లిందో అర్థం కావడం లేదు. అనగానే.. నువ్వేమీ టెన్షన్ పడకు నాన్నా. అలా కూర్చో.. అంటూ వాళ్ల నాన్నకు సర్ది చెప్పుతుంది. ఇద్దరూ భాగ్య ఎక్కడికి వెళ్లిందోనని తెగ టెన్షన్ పడుతుంటారు. దీప కూడా మరోసారి భాగ్యకు ఫోన్ చేస్తుంది. కానీ.. లిఫ్ట్ చేయదు. పిన్నికి ఏమైందోనని ఇద్దరూ టెన్షన్ పడతారు. తెలిసిన వాళ్ల ఇంటికి అయినా వెళ్లి తెలుసుకుంటా.. అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

కట్ చేస్తే మోనిత.. ద్రాక్షారామానికి ఫోన్ చేస్తుంది. అంజి గాడు నన్ను కొట్టి తప్పించుకున్నాడు మేడమ్ అని చెబుతాడు ద్రాక్షారామం. రాస్కెల్.. నిన్ను నమ్మి వాడిని అప్పగిస్తే.. వాడిని ఒక్కడిని చూసుకోలేకపోయావా? అంటూ చిరాకు పడుతుంది మోనిత. అసలు.. అంజిగాడు తప్పించుకొని ఎక్కడికి వెళ్లాడు. వాడు ఏదైనా ప్లాన్ లో ఉన్నాడా? అని టెన్షన్ పడుతుంది మోనిత.

కట్ చేస్తే.. సీన్ కార్తీక్ తండ్రి వద్దకు వెళ్తుంది. ఈ రోజు 25 వ తేదీ కదా.. కార్తీక్ తండ్రి తెగ తెన్షన్ పడుతుంటాడు. కార్తీక్.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని తెగ టెన్షన్ పడుతుంటాడు కార్తీక్ తండ్రి. దీప ఇంకెంత టెన్షన్ పడుతుందో అని భయపడతాడు. ఇప్పుడు దీప దగ్గరికి ఎందుకు డాడీ.. వద్దు అంటూ ఆదిత్య వారిస్తాడు.

అంజి దగ్గరకు వెళ్లిన డాక్టర్ బాబు ఇంకా రాకపోవడం, మరోవైపు తన పిన్ని కనిపించకపోవడంతో తెగ టెన్షన్ పడుతుంది దీప. ఇంతలో దీప పిల్లలు అక్కడికి వచ్చి అమ్మా.. ఆన్ లైన్ క్లాస్ అయిపోయింది.. అని అంటారు. మీరు 25 వ తేదీని కూడా మరిచిపోయారా? అని అడుగుతుంది. దీంతో 25వ తేదీ ఏంటి స్పెషల్ అని అడుగుతుంది దీప. దీంతో ఒకరోజు అందరం ఎటైనా బయటికి వెళ్దాం.. అని అడిగితే.. 25న వెళ్దాం అని అన్నావు కదా అమ్మ. గుర్తొచ్చిందా? అని అడుగుతుంది హిమ.

Advertisement

karthika deepam 6 august 2021 episode 1111 highlights

మీరు సాక్ష్యం ఉంటేనే తప్ప.. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోరు అనుకుంటా.. అంటూ దీప.. కార్తీక్ ను అడుగుతుంది. అవును.. నేను కాదు.. ఆ రోషిణి మేడమ్ కూడా నమ్మదు.. అని అంటాడు. దీంతో తను సూర్యాపేట హోటల్ లో తీసిన వీడియోను కార్తీక్ కు చూపిస్తుంది. దీపమ్మ కోసం చచ్చిపో. హిమను నేను ఎలా చంపించానో నిన్నూ అలాగే చంపిస్తా.. అంటూ అంజితో మోనిత అనడం వీడియోను చూసిన కార్తీక్.. వెంటనే కారు వేసుకొని బయలుదేరుతాడు. దీపకు కూడా చెప్పకుండా వెళ్లిపోతాడు. దీంతో.. దీప ఫోన్ చేసి.. ఏమండి.. ఎక్కడికి వెళ్తున్నారు.. అని అడుగుతుంది దీప. డాక్టర్ భారతి ఫ్రెండ్ చనిపోయిందట.. చూడటానికి వెళ్తున్నా.. అని అబద్ధం చెబుతాడు కార్తీక్. నిజమేనా.. అని అడుగుతుంది దీప. వెంటనే ఫోన్ కట్ చేసి.. చనిపోయిన వాళ్లను చూడటానికి కాదు.. ఆ మోనితను చంపడానికి వెళ్తున్నా.. అని కోపంతో రగిలిపోతాడు కార్తీక్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే.. శనివారం ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి