Home » Entertainment » Karthika Deepam Nirupam Paritala Viral Photo
Entertainment

Karthika Deepam : ఏంటి డాక్టర్ బాబూ ఇది.. అతుకుల చొక్కా వేసుకున్నావ్.. ఫోటో వైరల్

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: July 23, 2021, 3:38 pm
Advertisement

Karthika Deepam : పెద్ద పెద్ద స్టార్ హీరోలకు కూడా ఇంత ఫాలోయింగ్ ఉండదు. ఇంతమంది అభిమానులు ఉండరు. సోషల్ మీడియాలో ఇంత డిస్కషన్ కూడా ఉండదు. కానీ.. కార్తీక దీపం సీరియల్ హీరో డాక్టర్ బాబు అంటే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో పడి చచ్చిపోతారు జనాలు. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే వేరు. డాక్టర్ బాబు అంటే ఏంటి మాటలా? ఆయన పేరు నిరుపమ్ పరిటాల. కానీ.. డాక్టర్ బాబుగానే ఆయన బాగా ఫేమస్ అయ్యారు.

Advertisement

karthika deepam nirupam paritala viral photo

ఇదివరకు చాలా సీరియళ్లలో డాక్టర్ బాబు నటించినా.. పెద్దగా ఆయనకు గుర్తింపు రాలేదు. కానీ.. కార్తీక దీపం సీరియల్ తో ఆయనకు, వంటలక్కకు ఫుల్ క్రేజ్ వచ్చేసింది. డాక్టర్ బాబుకు ఎంత పాపులారిటీ ఉందంటే.. సోషల్ మీడియాలో ఆయన ఏదైనా పోస్ట్ పెడితే చాలు.. అది క్షణాల్లో వైరల్ కావాల్సిందే.

Advertisement

Karthika Deepam : డాక్టర్ బాబు అతుకుల చొక్కా ఫోటో వైరల్

తాజాగా డాక్టర్ బాబు.. తన ఫేస్ బుక్ అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ఒక ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో అతుకుల చొక్కా వేసుకొని సీరియస్ లుక్ తో కనిపిస్తాడు డాక్టర్ బాబు. కాస్త నవ్వొచ్చు కదా.. అని నాకు చెప్పకండి. ఎందుకంటే.. ఫోటో తీసినోడు నవ్వొద్దు అన్నాడు. ఎందుకు అంటే ఆటిట్యూడ్ అన్నాడు. ఈసారికి ఇలా కానివ్వండి. నా అతుకుల షర్ట్ నచ్చితే ఆ క్రెడిట్ నాది కాదు. దాన్ని తయారు చేసినోళ్లది.. అని దాన్ని కుట్టినోళ్లను కూడా ట్యాగ్ చేశాడు. మీరు కూడా ట్రై చేస్తారా? అంటూ క్యాప్షన్ పెట్టాడు నిరుపమ్.

నిజానికి.. డాక్టర్ బాబు.. సీరియల్ లో కూడా అంతే. ఆయన క్యాస్టూమ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సీరియల్ లోనే కాదు.. బయట కూడా ఇలాంటి డిఫరెంట్ షర్ట్స్ వేసుకొని డాక్టర్ బాబు రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఎంతైనా డాక్టర్ బాబుకు బుల్లితెర మీద ఉన్న క్రేజ్ మరే నటుడికి లేదు. అది డాక్టర్ బాబు అంటే.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి