Home » Andhra Pradesh » Kodali Nani Emotional Comments On Taraka Ratna
andhra pradesh

Kodali Nani – Taraka Ratna : తారకరత్న ఆ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకున్నారా? కొడాలి నాని సంచలన కామెంట్స్

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: February 20, 2023, 4:06 pm
Advertisement

Kodali Nani – Taraka Ratna : కొడాలి నాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏపీలోనే ఆయన డేర్ అండ్ డైనమిక్ లీడర్. వైసీపీ పార్టీలో కూడా ఆయన చాలా స్పీడ్ మీదుంటారు. సీఎం వైఎస్ జగన్ ను ఎవరైనా ఏదైనా అంటే అస్సలు ఊరుకోరు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కొడుకు నారా లోకేశ్ ను అయితే వేలి గోటితో తీసి అవతల పారేస్తారు. అంతటి ధైర్యం ఉన్న నాయకుడు కొడాలి నాని. అయితే.. కొడాలి నానికి, టీడీపీ పార్టీకి మధ్య అవినాభావ సంబంధం ఉన్న విషయం చాలామందికి తెలియదు.

Advertisement

kodali nani emotional comments on Taraka Ratna

కొడాలి నాని రాజకీయాల్లోకి వచ్చిందే టీడీపీ పార్టీ ద్వారా. రెండు సార్లు టీడీపీ పార్టీ నుంచి విజయం సాధించారు. ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో ఆయన టీడీపీలో చేరారు. ఆ పార్టీలో చాలా ఏళ్ల పాటు పని చేసిన తర్వాత 2012 లో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి వైసీపీలో చేరారు. అందుకే.. టీడీపీ పార్టీ నాయకులతో, ఎన్టీఆర్ కుటుంబంతో ఆయనకు చాలా అనుబంధం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా కొడాలికి చాలా దగ్గరి మిత్రుడు. తారకరత్న అకాల మరణంతో కొడాలి భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకంటే.. నందమూరి ఫ్యామిలీతో, తారకరత్నతో కూడా ఆయనకు అనుబంధం ఉంది.

Advertisement

Kodali Nani – Taraka Ratna : ఆసుపత్రి పాలు కాకముందు నాతో తారకరత్న మాట్లాడాడు

ఆసుపత్రిలో చేరకముందు తారకరత్న తనను కలిశారని చెప్పారు కొడాలి నాని. తాత గారు పెట్టిన పార్టీ కాబట్టి ఆ పార్టీ తరుపునే పోటీ చేద్దామని అనుకుంటున్నా అని తారకరత్న.. కొడాలి నానితో అన్నారట. దేనికి ఆశ పడకుండా.. ఎన్టీఆర్ మనవడు అయినప్పటికీ తన కష్టాన్ని నమ్ముకొని సినిమాల్లో, రాజకీయాల్లో ఎన్టీఆర్ చూపించిన దారిలోనే నడవాలని తారకరత్న అనుకున్నారని.. ఆ ప్రయత్నంలోనే మరణించారని కొడాలి ఈ సందర్భంగా తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

Advertisement

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి