Home » News » Ktr Fire On Congress Govt
News

KTR : చెక్‌డ్యామ్ కూడా సరిగ్గా కట్టలేని కాంగ్రెస్ నేతలు.. కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేయడం విడ్డురం – కేటీఆర్

Authored By
Sudheer Ramanujam
The Telugu News | Updated on: August 19, 2025 8:24 pm
Advertisement

KTR fire on Congress Govt : మహబూబ్ నగర్ జిల్లాలో చెక్‌డ్యామ్ కొట్టుకుపోయిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అడ్డాకుల మండలం గుడిబండ పెద్దవాగుపై రెండు నెలల క్రితం నిర్మించిన చెక్‌డ్యామ్ ఇటీవల కురిసిన వర్షాలకు కొట్టుకుపోయింది. ఈ ఘటనపై స్పందించిన కేటీఆర్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెడుతూ.. ఈ ఘటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చెక్‌డ్యామ్ కొట్టుకుపోయిన వీడియోను కూడా ఆయన తన పోస్ట్‌కు జత చేశారు. కాంగ్రెస్ కాంట్రాక్టర్ల నాసిరకం పనుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ ఆరోపించారు.

Advertisement

#image_title

ఈ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఎస్ఎల్‌బీసీ సొరంగం తవ్వడం, సుంకిశాల రిటైనింగ్ వాల్ కట్టడం వంటి పెద్ద పనులు చేతకాకపోయినా, కనీసం ఒక చిన్న వాగుపై చెక్‌డ్యామ్ కూడా సరిగా నిర్మించలేని స్థితిలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి అసమర్థత ఉన్న నేతలు ఇంజినీరింగ్ అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. గుడిబండ పెద్దవాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్ కేవలం రెండు నెలల్లోనే కొట్టుకుపోవడానికి గల కారణాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించాలని డిమాండ్ చేశారు.

Advertisement

నాణ్యత లేకుండా నాసిరకం పనులు చేసి, రైతుల పొలాలు, మోటార్ పైప్‌లైన్లు, చివరికి ట్రాన్స్‌ఫార్మర్ కూడా కొట్టుకుపోవడానికి కారణమైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నష్టపోయిన బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. ప్రాజెక్టుల మాట దేవుడెరుగు కానీ, కనీసం ఒక్క ఇటుకను కూడా సరిగా పేర్చలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ముక్కు నేలకు రాసి, మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టుపై నోరు పారేసుకోవద్దని ఎద్దేవా చేశారు. ఈ ఘటన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Sudheer Ramanujam

Author Bio Info : Sudheer Ramanujam Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి