Home » Andhra Pradesh » Mla Kethireddy Fires On Bank Manager
andhra pradesh

MLA Kethireddy : బ్యాంకులో కొన్ని లక్షల రూపాయలు ఫ్రాడ్… బ్యాంకులోకి వెళ్లి మేనేజర్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: March 11, 2023 12:45 pm
Advertisement

MLA Kethireddy : ధర్మవరం నియోజకవర్గంలో బ్యాంకులో 75 లక్షల ఫ్రాడ్ బయటపడింది. పొదుపు సంఘాల పేరుతో మహిళల దగ్గర నుండి డబ్బులు కలెక్ట్ చేసి వడయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రంగంలోకి దిగి.. బ్యాంకు సిబ్బందితో మాట్లాడటం జరిగింది. బ్యాంక్ అధికారులను పలు ప్రశ్నలు వేయడం జరిగింది. అయితే మహిళల దగ్గర నుండి ఏ వ్యక్తి అయితే డబ్బులు కలెక్ట్ చేసి పరారీ అయ్యాడో.. అతని భార్య బ్యాంకు దగ్గర ఉండటంతో ఆమెను కూడా ఎమ్మెల్యే ప్రశ్నించారు.

Advertisement

MLA Kethireddy fires on bank manager

ఇదే సమయంలో మిగతా వారిని కూడా ప్రశ్నించడం జరిగింది.పొదుపు సంఘాల డబ్బులు సరైన సమయంలో కట్టకపోతే వెంటనే బ్యాంకు అధికారులు చర్యలు తీసుకోవాలి. అయితే ఈ విషయంలో బ్యాంకు అధికారులు నిర్లక్ష్యం వహించడంతో… ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది మహిళలు మోసపోవటంతో… 75 లక్షల రూపాయలు పోగొట్టుకోవటంతో ఈ విషయాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి వాళ్ల సీరియస్ గా తీసుకోవడం జరిగింది. బ్యాంకులో అధికారులపై ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయటం..

Advertisement

వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇదే కుంభకోణంలో బ్యాంక్ అధికారుల పాత్ర కూడా ఉందని బయటపడటంతో.. బ్యాంకు మేనేజర్ ని ఎమ్మెల్యే కేజీ రెడ్డి గట్టిగా నిలదీశారు. ఈ క్రమంలో 2019 నుండి ఈ రకంగా జరుగుతున్నట్లు గుర్తించారు. ఇదే సమయంలో బ్యాంకు మేనేజర్ పై అధికారులకు కూడా ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. మహిళల దగ్గర డబ్బులు వడయించిన వ్యక్తికి.. బ్యాంక్ అధికారులకు సంబంధం ఉందని ఇదంతా పక్కా ప్లాన్ గా జరిగిందని ఎమ్మెల్యే కేతిరెడ్డి మండిపడ్డారు.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి