MLA Kethireddy : తప్పు మాదేలే పెద్దమ్మ ఏడవకు.. మహిళ కన్నీళ్లు తుడిచిన ఎమ్మెల్యే కేతిరెడ్డి
MLA Kethireddy : గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రజల సమస్యలను వాళ్ల ఇంటి వద్దకే వెళ్లి అడుగుతుంటారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో తన నియోజకవర్గం మొత్తం తిరుగుతూ అధికారులను కూడా తన వెంట తీసుకొని అక్కడికక్కడే ప్రజల సమస్యలను పరిష్కరిస్తుంటారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. చాలామంది ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడంలో కేతిరెడ్డి దిట్ట. తాజాగా ఉదయమే ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెళ్లారు.
MLA Kethireddy Gets Emotional
అక్కడ ఒక మహిళ తనకు ఇప్పటి వరకు ఎలాంటి పెన్షన్ రావడం లేదంటూ ఎమ్మెల్యేకు మొరపెట్టుకుంది. నీకు ఎందుకు పెన్షన్ రావడం లేదంటూ ఎమ్మెల్యే అడగడంతో ఏమో.. ప్రభుత్వ ఉద్యోగం ఉందంటూ ఇవ్వడం లేదంటూ ఆమె వాపోయింది. దీంతో ఆ మహిళకు పెళ్లయి పిల్లలు లేరు. భర్త వదిలేశాడు. దీంతో తన తమ్ముడి దగ్గర ఉంటోంది. తన తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం ఉండటం వల్ల.. ఆమెకు ప్రభుత్వం పెన్షన్ ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యేకు మొరపెట్టుకుంది. ఆ మహిళ సమస్యను తెలుసుకున్న కేతిరెడ్డి వెంటనే అధికారులతో అక్కడే మాట్లాడి..
MLA Kethireddy : వెంటనే ఆ మహిళను సపరేట్ చేయించిన కేతిరెడ్డి
వెంటనే తన తమ్ముడి కుటుంబంలో నుంచి ఆమె పేరును తీయించి తనను సపరేట్ చేసి వెంటనే పెన్షన్ కు అప్లయి చేయించారు ఎమ్మెల్యే. తన ఆధార్ కార్డును తీసుకొని వెంటనే అధికారులతో మాట్లాడారు. కార్డును డివైడ్ చేసి వెంటనే మార్చి ఆ మహిళకు వెంటనే పెన్షన్ ఇప్పించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. దీంతో ఆ మహిళ ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపింది. గత 20 ఏళ్ల నుంచి తిరగని ఆఫీసు లేదని ఆమె వాపోయింది. కేతిరెడ్డి వెంటనే సమస్యను అక్కడికక్కడే పరిష్కరించడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
