Home » Andhra Pradesh » More Than 80 Percent Families Supported Ap Cm Ys Jagan
andhra pradesh

YS Jagan : ఎన్నడూ లేనంత ఆనందంగా వైఎస్ జగన్.. కారణం ఇదే..!

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: May 8, 2023, 11:28 am
Advertisement

YS Jagan : మామూలు విషయం కాదిది. సీఎం జగన్ ప్రభుత్వానికి మద్దతుగా 1.16 కోట్ల కుటుంబాలు మిస్డ్ కాల్స్ ఇచ్చారు. జగనన్నే మా భవిష్యత్తు పేరుతో ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలుసు కదా. మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదం ప్రస్తుతం రాష్ట్రమంతా మారుమోగుతోంది. సీఎం జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ మళ్లీ జగనే అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ ఏకంగా 1.16 కోట్ల కుటుంబాలు మద్దతు పలుకుతున్నట్టు ప్రకటించాయి. ఈ విషయం మెగా పీపుల్స్ సర్వేలో వెల్లడైంది.

Advertisement

more than 80 percent families supported ap cm ys jagan

అంటే.. రాష్ట్రంలో ఉన్న 80 శాతం కుటుంబాలు సీఎం జగన్ పాలనకు మద్దతు తెలిపాయి. చివరకు టీడీపీ అభిమానులు కూడా వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. 22 రోజుల్లోనే దాదాపు 1.45 కోట్ల కుటుంబాలను జగనన్న సైన్యం కలుసుకుంది. అన్ని వర్గాల ప్రజల నుంచి జగనన్న సైన్యానికి అపూర్వ స్పందన లభించింది. ఈ సర్వేలో 80 శాతానికి పైగా కుటుంబాలు సీఎం జగన్ కు మద్దతు తెలిపాయి. రాష్ట్రంలోని 1.45 కోట్ల కుటుంబాలను కేవలం 22 రోజుల్లో 7 లక్షల మంది జగనన్న సైన్యం కలిశారు.

Advertisement

more than 80 percent families supported ap cm ys jagan

YS Jagan : 1.45 కోట్ల కుటుంబాలను కలిసిన 7లక్షల మంది సైన్యం

రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాల గురించి వాళ్లకు వివరించారు. పథకాలు సరిగ్గా అందుతున్నాయా అని ఆరా తీశారు. జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలిపితే పలానా నెంబర్ కు మిస్ కాల్ ఇవ్వాలని తెలిపారు. అలాగే.. ప్రతి ఇంటికి ఆయా కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు.. సీఎం జగన్ ఫోటో ఉన్న స్టిక్కర్లను ఇంటి తలుపులు, మొబైల్ ఫోన్లకు అతికించారు. ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవడం కోసం నేరుగా జనంలోకి వెళ్లడం ఒక అధికార పార్టీ చేసే సాహసం అనే చెప్పాలి. వైసీపీ అలా వెళ్లి చేయడం అనేది నిజంగా గ్రేట్. ఇదే దేశ చరిత్రలో తొలిసారి. ఏది ఏమైనా.. వచ్చే ఎన్నికల్లోనూ జగనన్ననే గెలిపించుకుంటాం అని 80 శాతానికి పైగా ప్రజలు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.

  1. Slot Pragmatic
  2. Slot Paling Gacor
  3. Slot Gacor 2023
  4. Demo Slot Pragmatic
  5. BO Togel Online
  6. Slot Gacor
  7. Data Keluaran HK

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి