Home » Andhra Pradesh » Mp Avinash Reddy Shares His Sister Sunitha Real Character
andhra pradesh

MP Avinash Reddy : వివేక హత్య కేసులో అసలు సూత్రధారి ఆమె అంటూ అవినాష్ రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: March 11, 2023 1:37 pm
Advertisement

MP Avinash Reddy : 2019 సరిగ్గా ఎన్నికల ప్రచారానికి ముందు మాజీమంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పటి ప్రభుత్వం టీడీపీ ఈ హత్య కావాలని వైయస్ జగన్ చేయించారని ఆరోపణలు చేయడం జరిగింది. ఇక ఇదే సమయంలో వైసీపీ వాళ్లు తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు చేశారు. అయితే ఈ హత్య కేసు విషయంలో వైయస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత న్యాయస్థానాల్లో పోరాడి సీబీఐ చేత ఎంక్వయిరీ చేయించే దిశగా కేసును ముందుకు నడిపించింది. అయితే ఈ కేసులో మొదటి నుండి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేరు వినిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే రెండుసార్లు సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరు కూడా అయ్యారు.

Advertisement

MP Avinash Reddy Shares His Sister Sunitha Real Character

ఈ క్రమంలో అవినాష్ రెడ్డి పాత్ర పై తీవ్రస్థాయిలో ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా వైఎస్ అవినాష్ రెడ్డి కేసు గురించి మీడియా దగ్గర మాట్లాడుతూ… సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ పై నెగిటివ్ కామెంట్లు చేశారు. కేసు విచారణ తప్పు దోవ పట్టించే విధంగా ఉందని అసలు విషయాలు వదిలేసి.. మిగతా విషయాలను పట్టించుకుంటున్నట్లు అవినాష్ రెడ్డి ఆరోపించారు. 2006 నుండి ఓ ముస్లిం మహిళతో ఉండేవారు. 2011వ సంవత్సరంలో ఇస్లాం ప్రకారం ఆయన తన పేరు మార్చుకుని ఆమెను వివాహం కూడా చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్లకి ఒక బిడ్డ కూడా జన్మించటం జరిగింది. దీంతో

Advertisement

ఆ బిడ్డని వివేకానంద రెడ్డి తన రాజకీయ వారసుడిగా ప్రకటించే అవకాశం ఉందని కుటుంబంలో విభేదాలు నెలకొన్నాయి. దీంతో ఆయన కుటుంబ సభ్యులే హతమార్చినట్లు,  ఈ క్రమంలో ఆయన ఉండే ఇంటిలో పత్రాలు కూడా లేకుండా… చేసినట్లు వైయస్ అవినాష్ రెడ్డి మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కేసులో ఎంతకైనా ముందుకెళ్తాను. ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అన్ని వాస్తవాలు బయటకు తీసుకొస్తా… ఇప్పటివరకు మౌనంగా ఉండటానికి కారణం కుటుంబ పరువు. ఈ హత్య కేసులో ఆయన కుటుంబ సభ్యుల అసలు సూత్రధారులు అంటూ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి