Home » News » Nalgonda Pocso Case Hot Topic Now
News

Nalgonda | నల్గొండ మైనర్ బాలికపై హత్యాచారం కేసులో నిందితుడికి ఉరిశిక్ష .. పోక్సో కోర్టు సంచలన తీర్పు

Authored By
Sam C
The Telugu News | Published on: August 14, 2025, 6:15 pm
Advertisement

Nalgonda | నల్గొండలోని దారుణ మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. దాదాపు పది సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం, నిందితుడు మహమ్మద్ ముకర్రంకు ఉరిశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు ఇన్‌ఛార్జి న్యాయమూర్తి రోజా రమణి సంచలన తీర్పు వెలువరించారు. ఈ కేసులో నిందితుడిపై రూ. 1.10 లక్షల జరిమానా కూడా విధించారు.

Advertisement

ఘటన ఎలా జరిగిందంటే

#image_title

Advertisement

2013లో నల్గొండలోని ఓ ప్రాంతంలో 12 ఏళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ముకర్రం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై తన నేరం బహిర్గతం అవుతుందన్న భయంతో బాలికను హత్య చేసి, మృతదేహాన్ని నాలాలో పడేశాడు. మూడు రోజుల అనంతరం పోలీసులు మృతదేహాన్ని గుర్తించి కేసును దర్యాప్తుకు తీసుకున్నారు.

2015లో నల్గొండ వన్ టౌన్ పోలీసులు కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.పోక్సో చట్టం, హత్య, బాలికల రక్షణ చట్టాల కింద కేసు నమోదు చేశారు.దశాబ్దకాలంగా వాదనలు, వాయిదాలు జరుగుతూ వచ్చిన ఈ కేసులో, 2025 ఆగస్టు 14న కోర్టు తుది తీర్పును వెలువరించింది.తమ కూతురికి చివరకు న్యాయం జరిగిందని బాధిత కుటుంబం స్పందించింది. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌లో కూడా ఇదే తరహా ఘటనలో, తన కూతురిపై అత్యాచారం చేసి హత్య చేసిన తండ్రికి పోక్సో కోర్టు ఉరిశిక్ష విధించింది. విచారణను కేవలం 15 నెలల్లో పూర్తిచేసి కోర్టు కఠినంగా స్పందించింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి