Home » National » Nirmala Sitharaman Union Budget 2026 Price Rise And Fall Explained
National

Nirmala Sitharaman Budget 2026 : నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌… ధరలు తగ్గేవి..పెరిగేవి ఇవే..!

Authored By
Suma
The Telugu News | Published on: February 1, 2026, 1:24 pm
Advertisement

Nirmala Sitharaman Budget 2026 : కేంద్ర  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ Nirmala Sitharaman వరుసగా తొమ్మిదవసారి కేంద్ర బడ్జెట్‌ను union budget 2026 ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌తో సామాన్య ప్రజలపై పడే ఆర్థిక ప్రభావం ఏంటి? ఏ వస్తువులు చౌక అవుతాయి? ఏవి ఖరీదవుతాయి? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. బడ్జెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాల వల్ల కొన్ని రంగాలకు ఊరట లభించగా పన్ను నిబంధనల విషయంలో మాత్రం కఠిన వైఖరి కనిపిస్తోంది.

Advertisement

Nirmala Sitharaman Budget 2026 : నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌… ధరలు తగ్గేవి..పెరిగేవి ఇవే..!

Nirmala Sitharaman Budget 2026 ధరలు తగ్గే అవకాశమున్నవి..

. బడ్జెట్‌లో డ్యూటీలు, ట్యాక్సులు తగ్గించడం వల్ల ఈ కింది వస్తువులు, సేవలు చౌకగా లభించే అవకాశం ఉంది:

Advertisement

విదేశీ పర్యటన ప్యాకేజీలు..

. టిసిఎస్ రేటు 5–20% నుంచి కేవలం 2%కి తగ్గింపు

Advertisement

విదేశీ విద్య ఖర్చులు..

. ఎల్ఆర్ఎస్ పరిధిలో విద్యా ఖర్చులపై తక్కువ టిడిఎస్

మద్యం తయారీకి ఉపయోగించే స్క్రాప్, ఖనిజాలు..

. డ్యూటీ 5% నుంచి 2%కి తగ్గింపు

Advertisement

షూ అప్పర్ ఎగుమతులు..

. డ్యూటీ లేకుండా దిగుమతులకు అనుమతి

ఎనర్జీ ట్రాన్సిషన్ పరికరాలు..

. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD) నుంచి మినహాయింపు

Advertisement

సోలార్ గ్లాస్ తయారీకి అవసరమైన వస్తువులు..

. బిసిడి నుంచి పూర్తిగా మినహాయింపు

కీలక ఖనిజాల తయారీలో వాడే క్యాపిటల్ గూడ్స్..

. బిసిడి మినహాయింపు

సివిలియన్ విమానాల విడిభాగాలు..

. దిగుమతులపై బిసిడి మినహాయింపు

మైక్రోవేవ్ ఓవెన్లు..

. కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు

వ్యక్తిగత అవసరాల కోసం దిగుమతి చేసే వస్తువులు..

. బిసిడి 20% నుంచి 10%కి తగ్గింపు

అరుదైన వ్యాధులు, క్యాన్సర్ చికిత్స మందులు

. బిసిడి మినహాయింపు

భారతీయ జలాల్లో పట్టిన చేపలు
. కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు

న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టుల కోసం దిగుమతులు
. బిసిడి మినహాయింపు

ధర పెరిగినవి లేదా కఠినతరం అయిన అంశాలు..

బడ్జెట్‌లో కొన్ని నిర్ణయాలు పన్ను చెల్లింపుదారులకు హెచ్చరికగా మారాయి:

ఇన్‌కమ్ టాక్స్ వివరాల్లో తప్పుడు వెల్లడి
. పన్ను మొత్తానికి సమానంగా 100% జరిమానా

చరాస్తుల వివరాలు దాచిపెట్టడం
. ఇకపై దీనిపైనా జరిమానా తప్పదు

స్టాక్ ఆప్షన్స్..ఫ్యూచర్స్ ట్రేడింగ్
. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ 0.02% నుంచి 0.05%కి పెంపు

ఇక బడ్జెట్ 2026 సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేలా కొన్ని వస్తువులు సేవల ధరలు తగ్గించడం ఈ బడ్జెట్‌లో స్వాగతార్హమైన అంశం. అయితే పన్ను నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న స్పష్టమైన సంకేతాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అంటే సౌకర్యాలు ఉన్నాయి కానీ నియమాలు తప్పనిసరి.

 

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి