Jr NTR – TDP : ఏపీ ప్రభుత్వం ఏ ముహూర్తాన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ యొక్క పేరును వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ అంటూ మార్చిందో కానీ ఇప్పుడు ఎన్టీఆర్ వారసుడు అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కష్టాలు మొదలయ్యాయి. నందమూరి ఫ్యామిలీ లో ఎన్టీఆర్ కి చాలా మంది వారసులు ఉన్నారు. అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా కీలకమైన వ్యక్తి అంటూ నందమూరి అభిమానులు ఇన్నాళ్లు మాట్లాడుకుంటూ వచ్చారు. తెలుగుదేశం లో ఉన్న వాళ్లు ఏదో ఒక సమయంలో ఎన్టీఆర్ ఖచ్చితంగా తాత పార్టీని చేజిక్కించుకుంటాడు అంటూ ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ కూడా ఇన్నాళ్లు తాత ని గౌరవిస్తూ తాతకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ వచ్చారు.
కానీ తాజాగా ఆయన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై స్పందించిన తీరుతో తాతపై ఆయనకు ఏ మాత్రం గౌరవం ఉందో క్లారిటీ ఇచ్చినట్లయ్యింది. కనీసం తాత గారు అని గౌరవార్థం పిలవకుండా ఏక వచనంతో పిలుస్తూ అవమానించాడంటూ తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అది కూడా వైకాపాలో ఉన్న కొందరు తన మిత్రుల కోసం ఈ విషయమై సీరియస్ అవ్వకుండా పొడి పొడిగా స్పందించాడంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ ఆ ఒక్క మాటతో తెలుగు దేశం పార్టీలో భవిష్యత్తు వారసుడు అన్నవాళ్ళు కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వారసుడంటే నారా లోకేష్ మాదిరిగా ఉండాలి, ఎన్టీఆర్ పేరు తొలగించిన వెంటనే నారా లోకేష్ స్పందించిన తీరు అభినందనీయం అంటూ చాలా మంది లోకేష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్వార్థం కోసం తన తాతను తక్కువ చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించలేదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఎన్టీఆర్ మళ్లీ స్పందిస్తే బాగుంటుందని ఆయన అభిమానులు కొందరు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు, మరి కొందరు ఇప్పటికే ఆయన అభిమానుల జాబితా నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఎన్టీఆర్ డౌన్ డౌన్ అంటూ చాలా చోట్ల రచ్చ రచ్చ చేస్తూ ఆయన పరువు తీసేలా మాట్లాడుతున్నారు. అసలు ఎన్టీఆర్ కి నందమూరి ఫ్యామిలీకి సంబంధం లేదన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఎన్టీఆర్ కెరియర్ మరియు రాజకీయ భవిష్యత్తు ని నాశనం చేసేలా మారిందంటూ ఆయన సన్నిహితులు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Vitamin D : మన శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ లలో విటమిన్ డీ కూడా ఒకటి. అయితే మన శరీరంలో…
Allu Arjun Biggest Cutout : పుష్ప 1 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప…
Cashews : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాటిలలో జీడిపప్పు కూడా ఒకటి. అయితే ఇది మన ఆరోగ్యానికి…
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమలో ఉందా.. అదేంటి ఆమె లవ్ లో పడ్డ మ్యాటర్…
Cinnamon Tea : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిలో…
Margashira Masam : కార్తీక మాసం డిసెంబర్ 2వ తేదీన ముగ్గుస్తుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి మార్గశిర మాసం…
CDAC Project Enginee : సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 98 పోస్టుల…
Utpanna Ekadashi : హిందూమతంలో ఉత్పన్న ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ…
This website uses cookies.