ys jagan
YS Jagan కోసం పుట్టి “ఆంధ్ర” అని పేరుపెట్టుకున్న వెబ్ సైట్, అదే జగన్ మోహన్ రెడ్డిపై వారం రోజులుగా వ్యతిరేక కథనాలు ప్రచురిస్తోంది. ప్యాకేజీ ప్రాబ్లమా? లేక షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం కోసం వ్యూహమో తెలియదు కానీ..కరెక్టుగా ఆంధ్రజ్యోతిలో షర్మిల పార్టీ పెడుతుందని ఆర్కే ఎడిటోరియల్ వచ్చిన నుంచీ ఆ ‘గ్రేట్’ వెబ్ సైట్ దిశ మారిపోయింది. గ్రేట్ వెబ్ సైట్ లో జగన్ మోహన్ రెడ్డి జైలుకెల్లినా వైసీపీని నిలబెట్టింది షర్మిల అంటూ స్పెషల్ స్టోరీ వేయడంతో ఆంధ్రజ్యోతిలో రాసింది పుకారు కాదని చెప్పినట్లు అయ్యింది.
జగన్ మోహన్ రెడ్డి సొంత మీడియా సంస్థ సాక్షిపైనా వ్యతిరేక కథనాలు ‘గ్రేట్’ వెబ్ సైట్ లో మొదలయ్యాయి. ఇసుక పాలసీపై సీఎంగా జగన్ విఫలం అయ్యారంటూ మరో స్టోరీ వేశారు. నిమ్మగడ్డని కెలికించి మరీ కొట్టించుకున్న జగన్ మోహన్ రెడ్డి అనే అర్థం వచ్చేలా సమీక్ష ఒకటి వేసి, చుట్టూ కోటరీ వల్ల జగన్ నష్టపోతున్నారని వీరందరినీ అర్జంటుగా తీసేయాలంటూ మరో సలహాలాంటి స్టోరీని కుమ్మేశాడు. వారం రోజుల్లో ఆ వెబ్ సైట్ వాళ్ళ ఆక్రోశం చూస్తుంటే..జగన్ తన సేవలు మరిచిపోయారని, వాటిని గుర్తు చేయాలంటే ఇలా వ్యతిరేక కథనాలు వేయడమే మార్గం అనుకున్నాడా? లేదంటే జగన్ మోహన్ రెడ్డిని ఫెయిల్యూర్‌గా చూపించి షర్మిలని తెరమీదకు తెచ్చే ప్రయత్నాలా అనే కోణంలోనూ విశ్లేషణలు సాగుతున్నాయి.
మరోవైపు జగన్ పార్టీ పెట్టకముందే వెబ్ సైట్ పెట్టి జగన్‌కి బాకా ఊదుతూ అందరిపైనా తప్పుడు వార్తలు రాసి కేసులు కూడా ఎదుర్కొన్నాడు ఆ సైట్ ఓనర్. అయితే జగన్ సీఎం అయితే మంచి ఫలితం ఉంటుందని బాగానే కష్టపడ్డాడు, కానీ అదే సమయంలో ఎంట్రీ ఇచ్చాడు మరో డిజిటల్ మీడియా ఓనర్ . వరస ఇంటర్వ్యూ లు చేస్తూ అందరి “డ్రీమ్” లు బయటపెట్టిన ఆ సంస్థ ఓనర్ కు ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ (APDC) VC&MD పోస్టు కట్టబెట్టారు.
దీంతోపాటు ప్రభుత్వం అనగా ఐఅండ్‌పీఆర్ లో 150 మంది ఉద్యోగులను వేసుకునే అవకాశం, ప్రభుత్వ కార్యక్రమాల డిజిటల్ ప్రచారం సంబంధించి 1000 కోట్ల ప్రాజెక్టు సంపాదించాడు. ఇందులో 400 కోట్లు దాక ప్రతిఫలంగాదక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇన్నాళ్లూ జగన్ కాపలా కాచిన గ్రేట్ వెబ్ సైట్ ఓనర్ కు ఎలాంటి ప్రాజెక్టు రాకపోగా మధ్యలో వచ్చిన వాళ్లకు ..వేలకోట్ల ప్రాజెక్టుతో హర్ట్ అయ్యాడని సమాచారం. ఇదే సమయంలో జగన్ జైలుకెళ్లే అవకాశాలున్నాయని, ఇదే జరిగితే భారతి టీమ్‌గా “డ్రీమ్” మీడియా వుంటుందని, తాను షర్మిల టీమ్‌గా ఉంటే భారీ ప్రతిఫలం దక్కే అవకాశం వుందని అటు ప్లేటు ఫిరాయించాడని కొందరు గ్రేట్ వెబ్ సైట్ కి పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులు చెబుతున్నారు.
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.