
Prime Minister Narendra Modi to come Telangana Liberation Day
Narendra Modi : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ‘విమోచన దినోత్సవానికి’ సంబంధించి వజ్రోత్సవం.. అంటూ హంగామా చేస్తోంది కమలదళం. కేంద్ర ప్రభుత్వమే ఈ వజ్రోత్సవ వేడుకలు నిర్వహించేలా సన్నాహాలు కూడా జరుగుతున్నాయి.వచ్చే ఏడాది వజ్రోత్సవం జరగనుండగా, ఈ ఏడాది ఆ వజ్రోత్సవానికి ప్రారంభోత్సవం చేస్తారు. సెప్టెంబర్ 17 నుంచి వరుస కార్యక్రమాలు జరుగుతాయట. ఈ కార్యక్రమాల్ని బీజేపీ ఊరూ వాడా తీసుకెళ్ళేందుకు ప్రయత్నిస్తోంది. సెప్టెంబర్ 17న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తారని బీజేపీ అంటోంది.
ఇంకోపక్క, ప్రధాని నరేంద్ర మోడీని కూడా హైద్రాబాద్ తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నారట కమలనాథులు. ప్రధాని మోడీ గనుక హైద్రాబాద్ వస్తే, ఆ కథ నిజంగానే వేరే వుంటుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అయితే ముందస్తుగానే ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచనతో వుంది.సో, బీజేపీకి ఎక్కువ సమయం ఇవ్వకపోవచ్చు తెలంగాణ రాష్ట్ర సమితి. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగొచ్చనే ప్రచారం షురూ అయిన సంగతి తెలిసిందే.
Prime Minister Narendra Modi to come Telangana Liberation Day
ఈ నేపథ్యంలో బీజేపీ కూడా అలర్ట్ అయ్యింది.వచ్చే ఏడాది వజ్రోత్సవం సంగతెలా వున్నా, ఈ ఏడాది తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలనీ, ప్రధాని మోడీ వస్తే ఇంకా బావుంటుందనీ తెలంగాణ బీజేపీ నేతలు అనుకుంటున్నారట. సెప్టెంబర్ 17 అంటే, దానికి ఎంతో దూరంలో లేదు. ఈలోగానే ప్రధాని టూర్ మీద ఓ స్పష్టత రావాలంటే.. ఇప్పటికిప్పుడు నిర్ణయం జరిగిపోవాలి.ఆ దిశగానే తెలంగాణ బీజేపీ కీలక నేతలు మంత్రాంగం నడుపుతున్నారట. ఓ కమిటీ ఢిల్లీకి వెళ్ళి అధిష్టానంతో చర్చించి, అలాగే కేంద్ర ప్రభుత్వ పెద్దలతోనూ మాట్లాడి.. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.