Home » Andhra Pradesh » Rajya Sabha Seats In Andhra Pradesh
andhra pradesh

Rajya Sabha : ఏపీ నుండి రాజస్యభకు వెళ్లే ఎంపీలు వీరేనా ?

Authored By
Sudheer Ramanujam
The Telugu News | Updated on: February 13, 2026, 1:27 pm
Advertisement

Rajya Sabha  : ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీకి సమయం దగ్గరపడుతుండటంతో, అధికార కూటమిలో అభ్యర్థుల ఎంపికపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. టీడీపీ, జనసేన మరియు బీజేపీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు మరియు అభ్యర్థుల ఖరారుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Advertisement

టీడీపీ కోటాలో కొత్త ముఖాలు – లోకేష్ సన్నిహితులకే ప్రాధాన్యమా?

ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు స్థానాల్లో శాసనసభలో ఉన్న బలాబలాల ప్రకారం కూటమికి అన్ని సీట్లు దక్కే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ కోటాలో మంత్రి నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడైన కిలారి రాజేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో పార్టీ గెలుపులో తెరవెనుక కీలక పాత్ర పోషించిన రాజేష్‌ను పెద్దల సభకు పంపాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉండి, పదవీ కాలం ముగుస్తున్న సానా సతీష్ కు మరొకసారి రెన్యూవల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, రాజకీయ నేపథ్యం కంటే ఆర్థికంగా బలంగా ఉన్నవారికే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు పార్టీలోని సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి.

Rajya Sabha Seats in Andhra Pradesh : ఏపీ నుండి రాజస్యభకు వెళ్లే ఎంపీలు వీరేనా ?

Advertisement

Rajya Sabha : జనసేన మరియు బీజేపీ అభ్యర్థుల సమీకరణాలు

పొత్తులో భాగంగా ఒక స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించే అవకాశం ఉంది. ఈ సీటు కోసం చంద్రబాబు నాయుడు నివాసముంటున్న కరకట్ట ఇల్లు యజమాని మరియు ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ పేరును పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన జనసేన కార్యాలయాల ఏర్పాటులోనూ సహకరించారు. ఇక బీజేపీ కోటా నుంచి మరొక కీలక వ్యక్తికి అవకాశం దక్కనుంది. అభ్యర్థుల ఎంపికలో పార్టీ కోసం కష్టపడిన వారి కంటే, పారిశ్రామికవేత్తలు మరియు ఆర్థికంగా వెన్నెముకగా నిలిచే వారికే మొగ్గు చూపుతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

Rajya Sabha సీనియర్లకు మొండిచేయి – వర్ల రామయ్య పరిస్థితి ఏమిటి?

కూటమి అభ్యర్థుల జాబితాలో ఎప్పటిలాగే పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య పేరు మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు గొంతుకగా నిలిచిన రామయ్యకు ఈసారైనా పెద్దల సభలో అవకాశం దక్కుతుందని ఆయన అనుచరులు ఆశించారు. కానీ, ప్రస్తుత సమీకరణాలు చూస్తుంటే ఆయనకు మళ్లీ మొండిచేయి తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాల కంటే ఆర్థిక బలం మరియు వ్యక్తిగత సాన్నిహిత్యమే రాజ్యసభ సీట్ల ఎంపికలో ప్రామాణికంగా మారుతుండటం టీడీపీలోని పాత తరం నేతలను కొంత అసంతృప్తికి గురిచేస్తోంది.

Sudheer Ramanujam

Author Bio Info : Sudheer Ramanujam Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి