Home » Entertainment » Ram Charan And Jr Ntr Rrr Dosti Song Out
Entertainment

RRR Dosti: దుమ్ములేపిన కీరవాణి.. RRR నుండి మొదటి సాంగ్ విడుద‌ల‌

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: August 1, 2021, 11:25 am
Advertisement

RRR సినిమా ప్రమోషన్స్ ఏ రేంజ్‌లో ఉంటున్నాయో అందరికీ తెలిసిందే. రాజమౌళి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అంతా తానై ఈ సినిమాను ముందుండి నడిపిస్తున్నాడు. నిర్మాణం, ప్రచారం, వ్యాపారం ఇలా అన్నింటిని తన కనుసన్నల్లోనే కానిస్తున్నాడు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల వరకు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇమేజ్ సరిపోతోంది. కానీ దేశ వ్యాప్తంగా బిజినెస్ కావాలంటే కేవలం రాజమౌళి మార్క్, ఆయన ముద్ర కావాల్సిందే. అందుకే ప్రతీ విషయాన్ని దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడు.

Advertisement

Ram Charan and Jr NTR RRR Dosti Song Out

అలా ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రతీ విషయంలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు. అందుకే మొదటి సాంగ్‌‌ను సరైన సమయం చూసి వదిలేశాడు. నేడు స్నేహితుల దినోత్సవం. ఈ చిత్రంలోనూ అల్లూరిగా కనిపించనున్న రామ్ చరణ్, కొమురం భీంగా నటించనున్న ఎన్టీఆర్ ఫ్రెండ్స్‌లానే కనిపించబోతోన్నారు. అందుకే ఈ ఇద్దరి మధ్య వచ్చే ఈ పాటకు దోస్తీ అనే పేరు పెట్టి నేడు ఈ పాటను ప్లాన్ చేశాడు. ఈ పాట కోసం ఐదు భాషల్లోని అద్భుతమైన సింగర్లను తీసుకొచ్చాడు కీరవాణి.

Advertisement

RRR Dosti.. దుమ్ములేపిన కీరవాణి

ఇక రాజమౌళి సినిమాలకు కీరవాణి ఎలాంటి సంగీతాన్ని ఇస్తాడో అందరికీ తెలిసిందే. ఈ దోస్తీ పాట కోసం తెలుగులో హేమచంద్రను, తమిళంలో అనిరుధ్, కన్నడలో విజయ్ ప్రకాష్, హిందీలో అమిత్ త్రివేది, యాజిన్ నజిర్ ఇలా ఐదుగురితో ఐదు భాషల్లో పాడించేశాడు. ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రీ సాహిత్యాన్ని అందించాడు. మొత్తానికి ఉదయం 11 గంటలకు విడుదలైన ఈ పాట ఇప్పుడు క్షణాల్లోనే వైరల్ అయింది. ఎక్కడ చూసినా దోస్తీ పాట గురించి చర్చలు కనిపిస్తున్నాయి.

Advertisement

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి