Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమలో ఉందా.. అదేంటి ఆమె లవ్ లో పడ్డ మ్యాటర్ కొత్తదేమి కాదు కదా అనుకోవచ్చు. ఓ పక్క విజయ్, మరోపక్క రష్మిక ఇద్దరు తాము ప్రేమలో ఉన్న విషయాన్ని చెప్పకనే చెబుతారు కానీ ఒకరి పేరు ఒకరు ఎప్పుడు చెప్పలేదు. ఈమధ్య ఒక ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండ 35 ఏళ్లకు ఎవరైనా సింగిల్ గా ఉంటారా అంటూ తాను సింగిల్ కాదనే విషయాన్ని చెప్పాడు. ఐతే తను ఎవరిని లవ్ చేస్తున్నారంటూ ఆసక్తికరంగా తన కో స్టార్ నే అని హింట్ ఇచ్చాడు. మరోపక్క రష్మిక నిన్న జరిగిన పుష్ప 2 ఈవెంట్ లో తాను ఒకరిని ఇష్టపడుతున్నానని అన్నది. ఈ ఇద్దరు వాళ్ల ఇంట్రెస్ట్ లను బయటకు చెప్పకపోయినా ఇద్దరు ప్రేమలో ఉన్నారన్న విషయం అర్ధమవుతుంది. తన బోయ్ ఫ్రెండ్ అతనే.. అతన్నే పెళ్లాడతా అంటూ చెప్పిన రష్మిక వాలకం చూస్తే ప్రియుడి పేరు చెప్పడానికి సిగ్గు మొగ్గలేస్తుందని అనిపిస్తుంది.
ఇక విజయ్, రష్మిక ఇద్దరు తమ లవ్ స్టోరీని దాదాపు బయట పెట్టారు. ఐతే ఇద్దరు ఏదో ఒకరోజు ఎంగేజ్మెంట్ తో షాక్ ఇస్తారని చెప్పొచ్చు. ఎంగేజ్మెంట్ ఏమో కానీ 2025 లోనే విజయ్ రష్మిక పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గౌతం తిన్ననూరితో ఒక సినిమా సెట్స్ మీద ఉంది. మరోపక్క రాజ్ కిరణ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ లో ఉంది.
రష్మిక సినిమాల విషయానికి వస్తే పుష్ప 2 రిలీజ్ కి రెడీ అవుతుండగా కుబేర, గర్ల్ ఫ్రెండ్ హిందీలో ఛావా, సికిందర్ సినిమాలు ఉన్నాయి. మొత్తానికి రష్మిక, విజయ్ సినిమాలతో పాటు వారి పర్సనల్ విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తున్నారు. పుష్ప 2 చెన్నై ఈవెంట్ లో శ్రీలీల స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఈవెంట్ కి శ్రీలీల కూడా అటెండ్ అయినా కూడా అందరి కళ్లు రష్మిక మీద ఉండటం విశేషం. Rashmika Open About Vijay Devarakona will marry next year , Rashmika, Rashmika Mandanna, Vijay Devarakonda, Pushpa 2, Gautham Tinnanuri
Allu Arjun Biggest Cutout : పుష్ప 1 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప…
Cashews : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాటిలలో జీడిపప్పు కూడా ఒకటి. అయితే ఇది మన ఆరోగ్యానికి…
Cinnamon Tea : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిలో…
Margashira Masam : కార్తీక మాసం డిసెంబర్ 2వ తేదీన ముగ్గుస్తుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి మార్గశిర మాసం…
CDAC Project Enginee : సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 98 పోస్టుల…
Utpanna Ekadashi : హిందూమతంలో ఉత్పన్న ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ…
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్సి అన్నారు.…
Ajit Pawar : మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే…
This website uses cookies.