Ys Jagan : రవితేజ హీరోగా డింపుల్ హయతీ హీరోయిన్ గా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఖిలాడి సినిమా ఈ నెల 11 వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. మొన్నటి వరకు సినిమా విడుదల విషయంలో కాస్త అనుమానాలు నెలకొన్నాయి. ఏపీలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతూ ఉండడం తో పాటు టికెట్ల విషయంలో క్లారిటీ రాలేదు. దాంతో ఈ సినిమా ను ఆ విషయాల పై క్లారిటీ వచ్చేంత వరకు వాయిదా వేసే అవకాశం ఉందని, అందుకే ఒక వారం రోజుల తర్వాత విడుదల చేసి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం జరిగింది. కానీ చిత్ర యూనిట్ సభ్యులు మరో సారి విడుదల విషయమై క్లారిటీ ఇచ్చారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఊ అన్నా ఊఊ అన్నా కూడా సినిమా విడుదలను వాయిదా వేసేది లేదంటూ తేల్చి పారేశారు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ లో కూడా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు గా అధికారికంగా తెలియజేశారు. ఒకవేళ సినిమా సక్సెస్ అయితే ఈ విషయం లో ఏపీలో అన్యాయం జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా ఖిలాడి ని విడుదల చేయడానికి అంత సుముఖంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే విడుదల ఆలస్యమైంది.. ఖిలాడి కి కేటాయించిన టైం లో విడుదల చేయకుంటే మళ్ళీ మూడు నాలుగు నెలల వరకు విడుదలకు ఇచ్చే అవకాశాలు లేవు. నిర్మాతల మండలి ఆదేశాల మేరకు విడుదల తేదీ విషయంలో మార్పులు చేసుకోవడం సాధ్యం కాదు అంటున్నారు.
పెద్ద ఎత్తున సినిమాల విడుదల ఉన్న కారణంగా ఖిలాడి ని జగన్ నిర్ణయం తో సంబంధం లేకుండా విడుదల చేసి తీరాల్సిందే అని రవితేజ టీం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రవితేజ ప్రస్తుతం ఖిలాడి సినిమాతో రెడీ అవుతుండగా అతి త్వరలోనే అంటే సమ్మర్ లో రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా రవితేజ నటిస్తున్న సినిమాల జాబితా పెద్దగానే ఉంది. త్రినాధరావు నక్కిన దర్శకత్వం లో ధమాకా అనే సినిమాను చేస్తున్నాడు. ఇదే సమయంలో సుధీర్వర్మ దర్శకత్వంలో రావణాసుర, వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు సినిమాలను కమిట్ అయ్యాడు. ఇవి కాక చిరంజీవి సినిమాలో కూడా రవితేజ నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి రవితేజ రాబోయే రెండు సంవత్సరాల్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని ఇచ్చేందుకు మాస్ సినిమాలతో రెడీ అవుతున్నాడు.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.