Home » Entertainment » Samantha Dancing Video In Viral
Entertainment

Samantha : నాగిని టైపు డ్యాన్స్ వేసిన స‌మంత‌.. వైర‌ల్ అవుతున్న వీడియో

Authored By
Sam C
The Telugu News | Updated on: February 25, 2022, 8:43 pm
Advertisement

టాలీవుడ్ ముద్దుగుమ్మ స‌మంత ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ల‌లో ఒక‌రు అనే విష‌యం తెలిసిందే. యూ ట‌ర్న్‌, ఓ బేబి వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌తో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో క్రియేటివ్ డైరెక్ట‌ర్ గుణ శేఖ‌ర్ రూపొందిస్తోన్న విజువ‌ల్ వండర్ ‘శాకుంత‌లం’. పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. ఇటీవ‌ల ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా, ఇది ప్రేక్ష‌కుల‌కి తెగ న‌చ్చేసింది.

Advertisement

ఇక సోష‌ల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ వ‌స్తున్న స‌మంత త‌న ఫిట్‌నెస్ వీడియోలు షేర్ చేస్తున్న విష‌యం తెలిసిందే. రోజూ ఫిట్ నెస్ విషయంలో సామ్ చాలా కేర్ తీసుకుంటుంది. తన వర్కవుట్స్ కు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఎంతటి కష్టతరమైన వర్కవుట్స్ అయిన సామ్ తన ట్రైనర్ సహయంతో సులభంగా పూర్తిచేస్తుంది. సమంత వర్కవుట్స్ చేయడమే కాకుండా.. ఆ వీడియోస్ షేర్ చేస్తూ… ఫాలోవర్లకు ఛాలెంజ్ విసురుతుంటుంది.తాజాగా సమంత వర్కవుట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Samantha dancing Video in viral

Advertisement

Samantha : స‌మంత స్ట‌న్నింగ్ వీడియో..

తాజాగా సమంత జిమ్ ట్రైనర్ ఆమె మొబిలిటీని అంచనా వేసేందుకు నాగిన్ మొబిలిటీ డ్రిల్ చేయించాడు.. అతను కర్రను పట్టుకుని సామ్ వైపు డిఫరెంట్ యాంగిల్స్‏లో ఆమె శరీరానికి టచ్ చేసేందుకు ట్రై చేస్తుంటే.. సామ్ ఆ కర్ర టచ్ కాకుండా ఉండేందుకు ట్రై చేసింది. ఆ పరీక్షలో సామ్ విజయం సాధించింది. నాగిన్ మొబిలిటీ డ్రిల్ తో సమంత సూపర్ ఫిట్ గా ఉందని ఫైనల్ నిర్దారణకు వచ్చాడు. నా ట్రైనర్ మీ కన్నా చాలా క్రేజీయెస్ట్… నన్ను తాకలేరు అంటూ సామ్ ఈ వీడియోను పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం స‌మంత స్ట‌న్నింగ్ వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి