Self Employment : యువతీ, యువకులు తమ చదువులు పూర్తి కాగానే ఉద్యోగ వేటలో మునిగిపోతారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు దక్కించుకునేందుకు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంటారు. అయితే ఏటా లక్షల్లో పట్టభద్రులు బయటి ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. అందుకు తగ్గట్టుగా ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో చాలామంది చిరుద్యోగులు, నిరుద్యోగులుగా మిగులుతున్నారు. అయితే కొంతమంది మాత్రం వినూత్నంగా ఆలోచిస్తూ స్వయం ఉపాధి పొందుతూ మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. అటువంటి వారిలో ఒకడే ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన చరణ్ అనే యువకుడు.గత 11 సంవత్సరాల నుండి ఈ యువకుడు మొక్కల పెంపకం వ్యాపారంలో రాణిస్తున్నాడు. పూల మెుక్కలు, పండ్ల మొక్కల పెంపకంలో లాభాలు గడిస్తున్నాడు. అంతేకాకుండా అరుదైన మొక్కలను పెంచి వాటిని విక్రయిస్తున్నాడు. ఏడాదికి రూ.10 లక్షలు ఆదాయం పొందుతున్నాడు.
పూలు, పండ్ల తోటలు పెంచే రైతులు నారు పెంపకంలో నర్సరీలపైన ఆధారపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే నర్సరీలు కూడా నూతన సాంకేతిక విధానం అందుకుంటూ మొక్కలను అభివృద్ధి చేసి రైతులకు అందిస్తున్నాయి. ఇలాంటి నర్సరీలు చాలామందికి ఉపాధి మార్గాలుగా మారాయి. కదిరికి చెందిన చరణ్ 70 సెంట్లలో అవుట్ డోర్, ఇండోర్ మొక్కలు సాగు చేస్తూ లాభాలను గడిస్తున్నాడు. తోటలు ఏపుగా పెరిగి మంచి దిగుబడులు రావాలంటే అది నారు మొక్కలపైనే ఆధారపడి ఉంటుంది. నాణ్యమైన మొక్కల ఎంపిక లేకపోతే తోట యజమానులకు దిగుబడి ఆదాయంలో అత్యంత నష్టం వాటిల్లితుంది. దాంతో ఇవి దృష్టిలో ఉంచుకున్న రైతులు పండ్ల తోటలను సాగు చేయాలనుకునేవారు మంచి నారుపై నర్సరీలపై ఆధారపడుతున్నారు.
అందుకు తగ్గట్టుగానే నర్సరీలు కూడా రైతుకు కావాల్సిన మొక్కలను పెంచి అందిస్తున్నాయి. చరణ్ నర్సరీలో 25 నుంచి 30 రకాల మొక్కలు లభిస్తాయ. పండా, ప్రెస్టేజ్, ఫైకస్, క్రొనొకర్పస్, జాస్మిన్, నూరువరాలు, సన్నజాజి, సంపంగి, నందివర్ధన, విరాజాజీ, రోజా, క్రిపర్స్, రెడీలిఫ్టిక్, అగ్లోనియం, హ్యాంగింగపాట్స్, లిల్లి, అమరలిల్లి, ఇన్సులిన్, మినిజమా, మినీ దానిమ్మ, హైబిస్కస్, థాయిలాండ్ స్పెషల్ మొక్కలు, గులాబీ మొక్కల లభిస్తాయి.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.