Minister Roja : మంత్రి రోజాపై భర్త సెల్వమణి సీరియస్ వీడియో వైరల్..!!
Minister Roja : వైసీపీ మంత్రి రోజా అందరికీ సుపరిచితురాలే. రాజకీయాల్లో రాకముందు హీరోయిన్ గా దక్షిణాది చలనచిత్ర రంగంలో అనేకమంది అభిమానం సంపాదించడం జరిగింది. జబర్దస్త్ షోలో న్యాయ నిర్నేతగా కొన్ని సంవత్సరాలు పాటు రాణించారు. అయితే ఇటీవల మంత్రివర్గ బాధ్యతలు చేపట్టాక జబర్దస్త్ షో ఇంకా బుల్లితెర కార్యక్రమాలకు రోజా దూరమయ్యారు. పర్యాటకశాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రంలో అందమైన ప్రదేశాలను అందరికీ తెలిసే రీతిలో వెలికి తీసి…
Minister Roja dispute again in Srikalahasti
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూ… బిజీ బిజీ పర్యటనలు చేస్తున్నారు. ఇదే సమయంలో సొంత జిల్లా చిత్తూరు కావటంతో ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతిలో స్వామివారిని మంత్రి రోజా దర్శించుకుంటారు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత శనివారం భర్త సెల్వమణితో కలిసి దర్శించుకోవడం జరిగింది. మంచి ఎండలు ఉన్న టైం కావడంతో అక్కడున్న భక్తులు సెల్ఫీలు కోరుతూ ఉండటంతో…
selvamani serious video on minister roja
రోజాకి ఆమె భర్త సెల్వమణి కాళ్లకు చెప్పులు లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో రోజా భర్త.. కొంత సీరియస్ కావడం జరిగింది. భద్రతా సిబ్బంది అడ్డుకుంటున్నా గాని భక్తులు చుట్టుపక్కల అభిమానులు సెల్ఫీలు కోరాటానికి వస్తూ ఉండటంతో.. సెల్వమణి కాస్త అసహనానికి లోనయ్యారు. భయంకరమైన ఎండలో ఒకపక్క కాలు కాలిపోతున్నాయని రోజా అర్థం చేసుకోవాలని చెబుతున్నా గాని ప్రజలు వినటం లేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
