#image_title
Dates | ఖర్జూరం అంటే చాలామందికి రుచికరమైన ఆరోగ్యాహారంగా గుర్తింపు ఉంది. కానీ ఇది కేవలం రుచి కోసమే కాదు. ముఖ్యంగా పాలలో నానబెట్టిన ఖర్జూరం తినడం వల్ల శక్తి, ఆరోగ్యం, సౌందర్యం – అన్నింటికీ మేలు జరుగుతుంది. అంతేకాదు, ఖర్జూరంలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ లాంటి పోషకాలు మన శరీరానికి అత్యంత అవసరమైనవి. ఇవి దినచర్యలో చేర్చడం వల్ల ఎంతో ఉపయోగపడతాయి.
#image_title
ఖర్జూరాల్లో సహజమైన చక్కెరలు (గ్లూకోజ్, ఫ్రుక్టోజ్) ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. ఉదయాన్నే ఖర్జూరం కలిపిన పాలను తాగితే గుండెల్లో ఉత్సాహం, శరీరంలో చురుకుదనం ఉంటుంది.
జీర్ణక్రియ మెరుగవుతుంది
ఖర్జూరం ఫైబర్ లో అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం లాంటి సమస్యలను నివారిస్తుంది. రాత్రంతా పాలలో నానబెట్టి తింటే, జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేస్తుంది.
ఎముకలు బలపడతాయి
పాలు, ఖర్జూరం రెండింటిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆస్టియోపొరోసిస్ (ఎముకల బలహీనత)ను నివారించడంలో తోడ్పడతాయి.
గుండెకు రక్షణ
ఖర్జూరంలో ఉన్న పొటాషియం రక్తపోటు నియంత్రణకు తోడ్పడుతుంది. అలాగే, పాలల్లో ఉండే మెగ్నీషియం గుండె ముంపు సమస్యల నుంచి రక్షణ ఇస్తుంది.
చర్మం, జుట్టు మెరుగవుతాయి
ఖర్జూరంలో ఉండే ఐరన్ (ఇనుము) రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఇది జుట్టు ఎదుగుదలకి బాగా సహాయపడుతుంది. అలాగే, ఖర్జూరం + పాలలో ఉండే విటమిన్ C & E చర్మాన్ని పోషించి సహజమైన కాంతిని అందిస్తాయి.
GST 2.0 : జీఎస్టీ శ్లాబుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా సంస్కరణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని నరేంద్ర…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే…
Oneplus | ప్రీమియం లుక్, ఫీచర్స్ ఉన్న స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికీ మంచి సమయం ఇది. రూ.30,000 - రూ.40,000…
AP District Court Jobs | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా కోర్టు లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న…
Bigg Boss9 | తెలుగు ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘బిగ్బాస్ తెలుగు సీజన్ 9’ సెప్టెంబర్…
Anushka Shetty | టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్పై…
Allari Naresh | అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఆల్కహాల్. ఈ సినిమా మెహర్ రాజ్…
Water | ఉదయం లేవగానే చాలామందికి బ్రష్ చేయడం, తర్వాత వెంటనే నీళ్లు తాగడం అలవాటు. కానీ పెద్దవాళ్లు "బ్రష్ చేసిన…
This website uses cookies.