
son commits suicide with alcoholic father behaviour in warangal
Son Suicide : చాలామంది తండ్రులు.. కొడుకులు చేసిన పనికి తట్టుకోలేరు. చివరి దశలో కొడుకులు తండ్రులను సరిగ్గా చూసుకోరు. కానీ.. ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఎందుకంటే తండ్రి చేసిన పనిని చూసి తట్టుకోలేక ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా ధర్మారంలో చోటు చేసుకుంది. ఆ యువకుడి పేరు శ్రీకాంత్. అతడి తండ్రి పచ్చి తాగుబోతు. ఒక్క రోజు కూడా ప్రశాంతంగా ఉండేవాడు కాదు శ్రీకాంత్ తండ్రి. ఇంట్లో ఎప్పుడూ అతడి వల్ల గొడవలే.
son commits suicide with alcoholic father behaviour in warangal
రోజూ మద్యం తాగి వచ్చి శ్రీకాంత్ తల్లిని కొడుతూ ఉండేవాడు తండ్రి. దీంతో శ్రీకాంత్ విసిగి వేసారిపోయాడు. చాలా ఏళ్లు తన తండ్రి చేసే చేష్టలను చూసి ఏం చేయలేకపోయాడు. ఒక్క రోజు కూడా ప్రశాంతంగా ఇంట్లో నిద్రపోయేవాడు కాదు శ్రీకాంత్. చిన్నప్పటి నుంచి ఇలాంటి ఘటనలతో బాధపడ్డ శ్రీకాంత్.. ఎలాగోలా డిగ్రీ వరకు చదివాడు. కానీ.. జాబ్ దొరకలేదు. దీంతో కూలి పని చేసేవాడు శ్రీకాంత్.తండ్రి మద్యానికి బానిస అవడంతో ఎప్పుడు కూడా తండ్రి బాటలో నడవొద్దని అనుకున్నాడు శ్రీకాంత్.
అందుకే తండ్రిలా మద్యానికి బానిస కాలేదు. కూలి పనులు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఇలా ఒకరోజు రాత్రి ఫుల్లుగా తాగి వచ్చిన శ్రీకాంత్ తండ్రి.. తన తల్లితో గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరు కొట్టుకునే వరకు వెళ్లారు. దీంతో ఏం చేయాలో తెలియని శ్రీకాంత్.. తన తల్లిని ఆమె అన్న ఇంటికి పంపించాడు. ఆ తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకున్నాడు. ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి శ్రీకాంత్ తల్లి రోదించిన తీరు చూసి స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.