Home » Entertainment » Sri Reddy Comments On Ys Jagan
Entertainment

Sri reddy : శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఈసారి జగన్ పేరు వాడేసిందే..!

Authored By
vamana sai
The Telugu News | Published on: May 11, 2021, 9:22 am
Advertisement

Sri reddy : శ్రీ రెడ్డి ఎప్పుడు ఎవరి మీద సంచలన వ్యాఖ్యలు చేస్తుందో ఎవరి మీద వల్గర్ కామెంట్స్ చేస్తుందో ఎవరూ చెప్పలేరు. వస్తే సునామీలా వచ్చి నానా రచ్చా చేస్తుంది. లేదంటే కొన్ని రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉంటుంది. టాలీవుడ్ సెలబ్రిటీలను..ఇక్కడ రాజకీయ నాయకులను ఎంతగా తనశైలిలో ఏకేసిందో అందరికీ తెలిసిందే. తనని వాడుకొని అవకాశాలు ఇవ్వలేదని పెద్ద పెద్ద హీరోలను, దర్శకులనే టార్గెట్ చేసి హాట్ టాపిక్ అయింది. ఈ విషయంలో ఒక ఛానల్ సపోర్ట్ తీసుకొని కొన్నాళ్ళు శ్రీరెడ్డి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.

Advertisement

తేజ లాంటి దర్శకులకు తన బాధ అర్థమయి సినిమాలలో అవకాశాలిస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఎక్కడా శ్రీ రెడ్డి కనిపించలేదు. మధ్యలో కొన్నాళ్ళు తమిళ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళింది. అక్కడ అవకాశాలు వస్తున్నాయని ఇటు టాలీవుడ్ వాళ్లని తిడుతూనే కోలీవుడ్ వాళ్ళని తిట్టడం మొదలు పెట్టింది. అక్కడ వాళ్ళు తనని అన్నీ రకాలుగా వాడుకున్నారని..అవకాశాలు మాత్రం ఇవ్వలేదని సోషల్ మీడియాలో చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. అంతేకాదు అక్కడ పొల్టికల్ లీడర్స్‌ను వదలలేదు.

sri reddy comments on ys jagan

Advertisement

Sri reddy : శ్రీ రెడ్డి స్టాలిన్‌ను జగన్‌తో పోల్చిందేంటో..?

అయితే ఈ మధ్య కొన్నాళ్ళు కుదురుగా ఉన్న శ్రీరెడ్డి ఇటీవల మళ్ళీ ఉదయనిధి స్టాలిన్ మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ మధ్య స్టాలిన్‌ను ఏకేసిన శ్రీరెడ్డి ఇటీవల ఆయన ఎన్నికల్లో ఎమ్మెల్యే గా భారీ మెజారిటీతో గెలిచాడు. దాంతో ఇప్పుడు షాకిస్తూ స్టాలిన్ మీద పొగడ్తల వర్షం కురిపిస్తోంది. అంతేకాదు స్టాలిన్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంత స్థాయికి చేరుకుంటాడని చేరుకోవాలని చెప్పుకొచ్చింది. ఆయన ఎమ్మెల్యే గా గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందంటూ తెలిపింది.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి