Home » News » Students Ragging In Suryapeta Medical College In Telangana
News

దారుణం : మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. బట్టలు విప్పించి సెల్ ఫోన్లో వీడియో తీసి..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 3, 2022, 9:27 am
Advertisement

Telangana : సూర్యాపేటలోని మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఓ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ర్యాగింగ్‌కు గురైన ఉదంతం కలకలం సృష్టిస్తోంది. బాధితుడి వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఆ విద్యార్థి సూర్యాపేటలోని వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. న్యూ ఇయర్ రోజు రాత్రి ఇంటి నుంచి హాస్టల్ కు చేరుకున్న సదరు విద్యార్థిని ద్వితీయ సంవత్సరానికి చెందిన దాదాపు 25 మంది విద్యార్థులు తమ గదిలోకి తీసుకెళ్ళారు.

Advertisement

పీకల దాకా తాగి ఉన్న మూర్ఖులు.. ర్యాగింగ్ పేరిట అతడిని చిత్ర హింసలు పెట్టారు. నీ కులం ఏమిటని అడుగుతూ, అక్కా చెల్లెలు ఎంతమంది వంటి ప్రశ్నలతో వేదించరుం అంతటితో ఆగక… అతడి బట్టలు విప్పించి వారి సెల్‌ఫోన్‌ లలో వీడియోలు తీసుకున్నారు. ఆపై దాడికి పాల్పడటమే కాక అతనికి గుండు గీసేందుకు యత్నించారు. వారి నుంచి తప్పించుకున్న బాధితుడు హైదరాబాద్ లోని తన తండ్రికి ఫోన్ చేయగా…

students ragging in suryapeta medical college in telangana

Advertisement

వారు స్థానిక పోలీసుకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్‌కు చేరుకుని బాధితుడిని రక్షించారు. ర్యాగింగ్ అంశం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు సీరియస్ అయ్యారు. జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్ రెడ్డి ఘటనపై విచారణకు ఆదేశించారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి