will anyone believe chandrababu now in telangana
ChandraBabu : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలో లేకపోవడంతో విచక్షణ కోల్పోయినట్లుగా మాట్లాడుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో కూడా పరాభవం తప్పదు అన్నట్లుగా భావించి నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం తో పాటు తన రాజకీయ అనుభవం మొత్తం కూడా బూడిదలో పోశాడా అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే అత్యంత ఎక్కువ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా తన పేరు ముందు ఉంటుంది అంటూ పదే పదే చెప్పే చంద్రబాబు నాయుడు ఈమద్య కాలంలో వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది అంటూ స్వయంగా తెలుగు తమ్ముళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అధికార పార్టీ వైకాపా తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించడం మరియు వారి యొక్క ప్రతి విధానాన్ని కూడా తప్పుబట్టడం అనేది ఇక్కడ వారి యొక్క పని అయ్యింది. ఉదాహణకు మొన్నటి పదవ తరగతి పరీక్షల్లో ఎక్కువ మంది పిల్లలు ఫెయిల్ అయ్యారు. ఆ విషయాన్ని కూడా రాద్దాంతం చేస్తూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. పిల్లల విద్యా ప్రమాణాలు బాగుండాలి.. వారి యొక్క విద్య బాగుంటేనే భవిష్యత్తు బాగుంటుంది అంటూ జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం పిల్లలు చదవకున్నా పాస్ చేయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ కొత్త వాదనకు తెర తీశాడు.
tdp chief ChandraBabu uncontrol his voice
ప్రపంచంలో ఎక్కడ కూడా చదవకుండా.. చదువు రాకున్నా పాస్ చేయాల్సిందే అంటూ అడిగిన వారు ఉండరు. కేవలం తెలుగు దేశం పార్టీ నాయకులు మాత్రమే ఈ పరిస్థితి ఉంటుంది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం బైజూస్ తో ఒప్పందం చేసుకుని విద్యార్థులకు అద్బుతమైన విద్యను అందించేందుకు ముందుకు వస్తే బై జూస్ ను జగన్ జూస్ అంటూ ఎద్దేవ చేసినట్లుగా మాట్లాడాడు. ఇది ఒక సుదీర్ఘ కాలపు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు మాట్లాడాల్సిన మాటలు కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రావాలి అంటూ పట్టుదలతో ఉన్న చంద్రబాబు నాయుడు నోటికి ఏది వస్తే అది మాట్లాడటం మంచి పద్దతి కాదు అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.