TDP Worrying About Janasena Pawan Kalyan
Pawan Kalyan : 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా.? అని ఆంధ్రప్రదేశ్‌లో అధికార పక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సూటిగా జనసేన పార్టీని ప్రశ్నిస్తోంది. పొత్తులు పెట్టుకుంటారా.? ఒంటరిగా పోటీ చేస్తారా.? పొత్తులు పెట్టుకుంటే, ‘బిచ్చం నాయక్..’, పొత్తు పెట్టుకోకపోతే ‘భీమ్లానాయక్’ అని వైసీపీ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జనసేన పార్టీకి తరచూ సవాల్ విసురుతుంటారు. కానీ, జనసేనాని అధికార వైసీపీ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేదు సరికదా, ‘మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్’కి సమాధానం చెప్పినట్లుగా ఆప్షన్స్ ఇచ్చేశారు.
జనసేన ముందు మూడు ఆప్షన్స్ వున్నాయంటూ జనసైనికులకే పెద్ద పరీక్ష పెట్టారాయన. ఒకటేమో బీజేపీతో కలిసి వెళ్ళడమట, ఇంకోటేమో టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేయడమట. మూడోది మాత్రం ఒంటరిగా పోటీ చేయడమట. ‘గతంలో నేను తగ్గాను.. ఇప్పుడు తగ్గడానికేమీ లేదు. తగ్గాల్సింది మీరే..’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుని ఉద్దేశించి సినిమాటిక్ డైలాగు చెప్పారు పవన్ కళ్యాణ్. ఇదేమన్నా సినిమానా.? కాదు కదా.! ఇది రాజకీయం. జనానికి సేవ చేయడానికే రాజకీయాల్లోకి రావాలి ఎవరైనా. ఈ క్రమంలో పొత్తులనేవి సర్వసాధారణమే కావొచ్చు.
Three Options, Pawan Kalyan Same Old Pattern
ఆ విషయాన్ని అయినా స్పష్టంగా చెప్పాలి కదా.?జనసైనికులు కేవలం జనసేన జెండా మాత్రమే పట్టుకుంటే సరిపోతుందా.? లేదంటే, టీడీపీతో పాటు బీజేపీ జెండా కూడా పట్టుకోవాలా.? అన్నదానిపై పవన్ కళ్యాణ్ స్పష్టత ఇవ్వాల్సి వుంది. కానీ, పవన్ కళ్యాణ్ నుంచి అలాంటి స్పష్టతని ఎవరూ ఆశించకూడదు. ఆయన మాత్రం నిబద్ధతతో రాజకీయాలు చేసేస్తున్నామని చెప్పేసుకుంటారు. నిబద్ధత అంటే జవాబుదారీతనం. ప్రజలకో, జనసైనికులకో అయినా పొత్తుల విషయమై పవన్ కళ్యాణ్ జవాబుదారీతనం చూపాలి కదా.?
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
This website uses cookies.