Home » National » Uncle Burned Alive For Protesting Against Daughter In Laws Illicit Relationship
National

Illicit Relationship : కోడలి అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన మామను ఏం చేసిందో తెలిస్తే మీరు బిత్తర పోతారు..!

Authored By
Sudheer Ramanujam
The Telugu News | Updated on: February 2, 2026, 1:32 pm
Advertisement

Illicit Relationship : దేశ వ్యాప్తంగా అక్రమ సంబంధాలు రోజు రోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ అక్రమ సంబంధాల మోజులో పడి హత్యలు చేయానికి కూడా వెనకడుగు వేయడం లేదు. తాజాగా తమిళనాడు లో దారుణం చోటుచేసుకుంది. అక్రమ సంబంధానికి మామ అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో చంపించిన ఘటన అందర్నీ షాక్ కు గురి చేస్తుంది.

Advertisement

Illicit Relationship : కోడలి అక్రమ సంబంధాన్ని బట్టబయలు చేసిన మామను..తగలపెట్టిన ప్రియుడు

తమిళనాడు, కడలూరు జిల్లాలో తన కోడలు జయప్రియ మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయాన్ని గమనించిన మామ రాజేంద్రన్ (64), ఆమెను మందలించడమే ఆయన చేసిన పాపమైంది. తమ రహస్య బంధానికి రాజేంద్రన్ అడ్డుపడుతున్నాడని భావించిన కోడలు, తన ప్రియుడు మణికందన్‌తో కలిసి ఆయనను అంతం చేయాలని పథకం రచించింది. వృద్ధుడని కూడా చూడకుండా, సమాజం ఏమనుకుంటుందో అన్న భయం లేకుండా అత్యంత కిరాతకంగా ఆయనపై దాడికి తెగబడ్డారు.

Advertisement

ఈ ఘాతుకం జరిగిన తీరు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. రాజేంద్రన్ తన బైక్‌పై వెళ్తుండగా, మణికందన్ మరికొందరితో కలిసి ఆయనను అడ్డుకున్నాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే రాజేంద్రన్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో చిక్కుకున్న ఆ వృద్ధుడు ప్రాణభయంతో రోడ్డుపై పరుగులు తీస్తుంటే, కనీసం ఎవరూ అడ్డుకోలేకపోయారు. ప్రస్తుతం రాజేంద్రన్ 70 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమవ్వగా, అవి చూసిన వారందరినీ కలచివేస్తున్నాయి.

ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు తక్షణమే స్పందించి దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితురాలైన కోడలు జయప్రియ, ఆమె ప్రియుడు మణికందన్‌తో పాటు ఈ కుట్రలో సహకరించిన మరో ఇద్దరిని కలిపి మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితులపై హత్యాయత్నం మరియు ఇతర కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Sudheer Ramanujam

Author Bio Info : Sudheer Ramanujam Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి