Vidadala Rajini speech about chandrababu and jagan
Vidadala Rajini : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక “నాడు నేడు” అనే కార్యక్రమం పేరిట హాస్పిటల్స్ మరియు స్కూల్స్ రూపురేఖలు మార్చడం తెలిసిందే. నాడు చంద్రబాబు హయాంలో ఏ రకంగా శిథిలావస్థలో ప్రభుత్వ హాస్పిటల్స్ మరియు స్కూల్ భవనాలు ఉన్నాయో వాటిని రూపురేఖలు మార్చి .. మెరుగైన సదుపాయాలు కల్పించడం జరిగింది. ఇదిలా ఉంటే రాజకీయాల్లో ఎవరికి వారు స్వార్ధంగా తమ కెరియర్ కోసం ప్రవర్తిస్తుంటారని సంగతి తెలిసిందే. వాళ్లని ఎక్కువగా జంపింగ్ జపంగ్ లు అంటారు. ఈ రకంగానే మంత్రి విడుదల రజనినీ నాడు నేడు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆడుకుంటున్నారు.
Vidadala Rajini speech about chandrababu and jagan
ఎందుకంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీలో టికెట్ ఆశించి.. సరిగ్గా ఎన్నికల సమయంలో చంద్రబాబు నిర్వహించిన మహానాడులో వైఎస్ జగన్ ని తీవ్రస్థాయిలో విమర్శించింది. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని తన స్పీచ్లో సినిమా డైలాగులు తరహాలో హోరెత్తిచ్చింది. కానీ చివర ఆఖరికి చూసుకుంటే విడుదల రజిని 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో జాయిన్ అయి చిలకలూరిపేట నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ప్రస్తుతం మంత్రిగా రాణిస్తుంది.
ఈ సందర్భంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైఎస్ జగన్ గురించి మాట్లాడుతూ విడుదల రజిని ఎమోషనల్ అయింది. దాదాపు కన్నీరు పెట్టుకునే అంత సీన్ క్రియేట్ చేసింది. వైయస్ జగన్ తనకి రాజకీయ బిక్ష పెట్టినట్లు పెద్ద పెద్ద డైలాగులు వేసింది. అయితే అప్పట్లో చంద్రబాబు దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా ఇప్పుడు జగన్ దగ్గర మరోలా విడుదల రజిని మాట్లాడిన రెండు వీడియోలను జత చేసి.. సోషల్ మీడియాలో నెటిజన్స్.. ఏ ఎండకు ఆ గొడుగు అంటే ఇదేనేమో అని కామెంట్లు చేస్తున్నారు.
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
This website uses cookies.