Home » News » Vijayashanthi Sensational Comments On Cm Kcr
News

కేసీఆర్ నాకన్నా గొప్ప నటుడు.. ఆయన పతనం మొదలైంది.. రాములమ్మ షాకింగ్ కామెంట్స్?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: December 11, 2020 8:18 am
Advertisement

విజయశాంతి… తెలుగు ఇండస్ట్రీని ఒకనోక సమయంలో ఏలిన నటి. వందల సినిమాల్లో హీరోయిన్ గా.. మెయిన్ రోల్ లో చేసి.. తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటి. ఈమెకు ముద్దుగా రాములమ్మ అని కూడా ప్రేక్షకులు పేరు పెట్టారు. ఇటీవల కూడా ఓ సినిమాలో అతిథి పాత్రలో కనిపించి మళ్లీ తనలోని నటనను బయటికి తీసింది రాములమ్మ.

Advertisement

vijayashanthi sensational comments on cm kcr

గత కొన్ని రోజుల నుంచి రాములమ్మ గురించే చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. విజయశాంతి కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే పార్టీ తీర్థం పుచ్చుకుంటారని.. దుబ్బాక ఉపఎన్నిక సమయం నుంచి వార్తలు వచ్చాయి. కానీ.. ఇటీవలే రాములమ్మ బీజేపీ తీర్థం పుచ్చుకుంది. బీజేపీలో చేరిన తర్వాత విజయశాంతి.. తన టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నారు. సీఎం కేసీఆర్ మీద ఫోకస్ పెట్టారు. సీఎం కేసీఆర్ మీద తన విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు.

Advertisement

కేసీఆర్ పై పంచ్ డైలాగులు

కాంగ్రెస్ ఉన్నన్ని రోజులు ఒక్క మాట కూడా మాట్లాడని విజయశాంతి.. తాజాగా సీఎం కేసీఆర్ పై రెచ్చిపోతున్నారు. తన సినిమా పంచ్ డైలాగ్ లను ఆయన మీద విసురుతున్నారు విజయశాంతి.

కేసీఆర్ నాకంటే గొప్ప నటుడు. ఆయన తెలంగాణ ప్రజల రక్తం కూడు తింటున్నారు. కేసీఆర్ పతనం ప్రారంభం అయింది. తొందరలోనే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కనుమరుగు అవుతుంది. అమరవీరుల శవాలపై కూర్చొని సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారు. టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీ చేసుకున్న మ్యాచ్ ఫిక్సింగ్ సంగతి కూడా నాకు తెలుసు. అందుకే తెలంగాణలో భవిష్యత్తు అంతా బీజేపీదే అంటూ రాములమ్మ జోస్యం చెప్పారు.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి