
why kcr giving rajya sabha seat to actor prakash raj
Prakash Raj : తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేసినా కూడా రాజకీయంగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాత్రమే చేస్తాడు అంటూ ఆయన సన్నిహితులు మరియు రాజకీయ వర్గాల వారు అంటూ ఉంటారు. రాజకీయంగా కలిసి వస్తుంది అనుకుంటేనే ఆయన ఏ పని అయినా చేస్తాడు అంటూ ఒక అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే చేస్తారు. కానీ కేసీఆర్ ఇంకాస్త ఎక్కువ ఆలోచిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయంగా కలిసి వస్తుంది అనుకుంటే కొన్నిసార్లు తగ్గడం.. కొన్నిసార్లు తొక్కేయడం.. కొన్నిసార్లు లేపడం.. లాంటివి చేయడం కేసీఆర్ నుండి చూశాం. ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలి అనేది బాగా తెలిసిన వ్యక్తి కేసీఆర్.కేంద్రంలో ఎవరితో ఎప్పుడు ఎలా ఉండాలి అనే విషయాలపై పూర్తి అవగాహణ ఉన్న వ్యక్తి కనుక ఇన్నాళ్లు చాలా సాఫీగా రాజకీయాన్ని నడుపుకుంటూ వచ్చాడు.
ఒకప్పుడు కాంగ్రెస్ తో లాలూచీపడిన కేసీఆర్ ఆ తర్వాత బిజెపికి సాహిత్యం గా ఉన్నాడు. మోడీని ఒకానొక సమయంలో గొప్ప నాయకుడు అంటూ పొగడ్తల్లో ముంచెత్తిన కేసీఆర్ ఇప్పుడు దెయ్యం అంటూ విమర్శిస్తున్నాడు అంటే అది ఖచ్చితంగా రాజకీయ వ్యూహంలో భాగమే అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు మోడీకి వ్యతిరేక రాజకీయ శక్తిని తయారు చేయడం కోసం కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే ఇటీవల మహారాష్ట్ర వెళ్లి ఉద్దవ్ ఠాక్రే ను కలవడం జరిగింది.ఇదే సమయంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ ని టీఆర్ఎస్ తరపున రాజ్యసభకు పంపించేందుకు ఏర్పాట్లు చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. రాజకీయాల్లో ఎప్పటికప్పుడు క్రియాశీలకంగా ఉండే ప్రకాష్ రాజ్ ఇటీవల మహారాష్ట్ర కు కేసీఆర్ తో కలిసి వెళ్లడం.. అక్కడు ఉద్దవ్ ఠాక్రే ను కలవడం జరిగింది. గత కొన్నాళ్లుగా టిఆర్ఎస్ కి దగ్గరగా ఉంటున్న కారణంగా ప్రకాష్ రాజ్ రాజ్యసభకు కేసీఆర్ సార్ సాయంతో వెళ్లబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
why kcr giving rajya sabha seat to actor prakash raj
ప్రకాష్ రాజ్ ని రాజ్యసభకు పంపించడం అంటే చాలా పెద్ద విషయం. ప్రకాష్ రాజ్ నుండి అత్యంత భారీ సహాయం పొందినట్లయితే నే కేసీఆర్ ఆయన్ను రాజ్యసభకు పంపించే అవకాశం ఉంటుంది. మరి ప్రకాష్ రాజ్ నుండి కేసీఆర్ అంత భారీ సహాయం ఏం పొంది ఉంటాడు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా ప్రకాష్ రాజు వల్ల ఏదైనా పెద్ద సహాయం దక్కే అవకాశం ఉంది ఏదైనా ఉంటుందేమో అని కేసీఆర్ భావిస్తున్నారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రకాష్ క్రియాశీల రాజకీయ నాయకుడు కాదు. ఆయన కేవలం నటుడు మాత్రమే.. కానీ బిజెపికి వ్యతిరేకంగా మాత్రం పని చేస్తున్నాడు. గత కొంత కాలంగా బిజెపిని వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. కేసీఆర్ రాజ్యసభకు పంపడం వల్ల ప్రకాష్ రాజ్ నుండి కేసీఆర్ ఏం ఆశిస్తున్నాడు అంటూ రాజకీయ విశ్లేషకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు గుసగుసలాడుకుంటున్నారు.
ABN Radha Krishna : ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా ఎన్నికల తర్వాత సమీకరణాలు వేగంగా…
Revanth Reddy : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను…
Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో…
Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…
RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
Weather Report : ఆంధ్రప్రదేశ్‌లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది.…
Petrol 3 Rs Only : ప్రస్తుత రోజుల్లో సామాన్యుడికి పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో…
Gold Silver Rate April 11th 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు ఇది ముఖ్యమైన…
Karthika Deepam 2 April 11th 2026 Today Episode : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న…
Onion Majjiga Pulusu Recipe : ఉల్లిపాయ మజ్జిగ పులుసు ఆంధ్ర ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన వంటకం. ముఖ్యంగా…
Watermelon Seeds : వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఈ వేడిని తట్టుకోవడంలో సహజసిద్ధమైన ఆహారాలు ముఖ్య పాత్ర…
This website uses cookies.