Home » Andhra Pradesh » Ycp Mla Mekathoti Sucharita Comments On Her Party Change
andhra pradesh

Mekathoti Sucharita : పార్టీ మారుతున్నారా అని అడగగానే మాజీ హోమ్ మంత్రి సుచరిత ఆన్సర్ చూడండి..!!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: January 5, 2023, 6:00 pm
Advertisement

Mekathoti Sucharita : మేకతోటి సుచరిత తెలుసు కదా. తను ఏపీ మాజీ హోం మంత్రి. వైసీపీ ఎమ్మెల్యే. గత సంవత్సరం మంత్రివర్గ విస్తరణలో భాగంగా తన మంత్రి పదవిని ఆమె కోల్పోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆమె పార్టీకి అంటిముట్టనట్టే ఉన్నారు. తనలో కొంచెం మార్పు వచ్చింది. తన మంత్రి పదవి పోవడం వల్ల తను వైసీపీ పార్టీలో కొనసాగుతారా లేక వేరే పార్టీలో చేరుతారా అనే అనుమానం అందరిలో కలిగింది. దీంతో.. తాను వైసీపీలోనే ఉంటానంటూ చాలాసార్లు సుచరిత చెప్పుకొచ్చారు.

Advertisement

అయితే.. తను జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈనేపథ్యంలో త్వరలో ఎన్నికలు రానున్నాయి కాబట్టి ఇప్పుడు సుచరిత అడుగు ఎటువైపు ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి.. సుచరితకు సీఎం జగన్ పార్టీలో మంచి స్థానం అందించారు. సుచరిత కూడా జగన్ కు సపోర్ట్ గా నిలిచారు. అందుకే.. ఆమెకు తొలి కేబినేట్ లోనే హోం మంత్రి అవకాశం వచ్చింది. కాకపోతే కేబినేట్ విస్తరణలో ఆమె తన మంత్ర పదవిని కోల్పోవాల్సి వచ్చింది.

ycp mla mekathoti sucharita comments on her party change

Advertisement

Mekathoti Sucharita : భర్త అడుగుజాడల్లో నడుస్తా అని చెప్పిన సుచరిత

తన రాజకీయాలు మొత్తం వైసీపీతోనే అని చెప్పుకొచ్చారు సుచరిత. కాకపోతే.. తన భర్త దయాసాగర్ ఏం చెబితే అది అని అంటున్నారు. నిజానికి తన భర్త కూడా ఇప్పుడు వైసీపీతోనే ఉంటా అని మాటిచ్చారు. కానీ.. భవిష్యత్తులో ఆయన పార్టీ మారితే.. తనతో పాటు రమ్మంటే నేను కూడా వెళ్లాల్సి వస్తుంది అని చెప్పుకొచ్చారు. నేను ఒక పార్టీలో, నా భర్త ఒక పార్టీలో, నా పిల్లలు ఒక పార్టీలో ఉండటం అంటే అది అసాధ్యం అని.. తామంతా ఒకే పార్టీలో ఉంటామని సుచరిత స్పష్టం చేశారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి