ycp mla perni nani counter on nadda comments
Perni Nani : ఇటీవల శ్రీకాళహస్తిలో బీజేపీ భారీ బహిరంగ సభ జరిగిన విషయం తెలుసు కదా. ఆ మీటింగ్ లో బీజేపీ జాతీయ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాళ్లు వైసీపీ పాలనపై ఎక్కు పెట్టారు. ముఖ్యంగా జేపీ నడ్డా మాత్రం వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై మండిపడ్డారు. దీంతో మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని.. జేపీ నడ్డాపై కౌంటర్స్ వేశారు. జేపీ నడ్డాతో పాటు తెలంగాణ మినిస్టర్ పేర్ని నానిపై కూడా తనదైన శైలిలో పేర్ని నాని విరుచుకుపడ్డారు.
కర్ణాటకలో బీజేపీ పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పాలా? బీజేపీ కుక్క చావు చచ్చింది. నడ్డా కొంచెం మర్యాదగా మాట్లాడి ఉండే బాగుండేది. అడ్డంగా ఉన్న నడ్డా చాలా మాట్లాడారు. ఆయన మనువు బీజేపీతో.. మనస్సు చంద్రబాబుతో ఉన్న సీఎం రమేశ్, సత్య కుమార్, సుజనా చౌదరి వంటి వాళ్ల మాటలను నడ్డా చెవికి ఎక్కించుకుంటే అది నీ ఖర్మ.. అంతే అంటూ పేర్ని నాని తేల్చి పడేశారు.
ycp mla perni nani counter on nadda comments
ఏపీలో ల్యాండ్ స్కాం జరుగుతోందట. ల్యాండ్ స్కాం జరగడం కాదు.. విశాఖ ఉక్కు పీక కోద్దామని మీరే కదా అనుకున్నది. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను ప్రైవేటు వారికి ఇచ్చేస్తారనే అనుమానం మాకు ఉంది. అది అతి పెద్ద బీజేపీ మార్కు ల్యాండ్ స్కాం, జగన్ పాలనలో అలాంటి వాటికి చోటు ఉండదు.. అని తేల్చి చెప్పారు పేర్ని నాని. అదానీకి, వేదాంతకు కేంద్రం క్యాప్టివ్ మైన్లను కట్టబెట్టలేదా.. విశాఖ ఉక్కుకు మాత్రం ఎందుకు క్యాప్టివ్ మైన్ ఇవ్వడం లేదు అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాల్లో ఒక్కటైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా? అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.
Single Movie : టాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన శ్రీవిష్ణు నటించిన ‘సింగిల్’ సినిమా ట్రైలర్ చుట్టూ వివాదం చెలరేగింది. ఈ…
Gas Cylinder Prices : 2025 మే 1నుంచి వాణిజ్య LPG గ్యాస్ ధరల్లో తగ్గింపు చోటుచేసుకుంది. చమురు మార్కెటింగ్…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh లో ముఖ్యమంత్రి CM చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక…
America Pakistan : జమ్మూ కశ్మీర్‌లోని పహాల్గమ్ వద్ద ఇటీవల జరిగిన ఉగ్రదాడిపై అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.…
Ys Jagan : సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయం లో చందనోత్సవం సందర్భంగా జరిగిన గోడ కూలిన ఘటన…
Husbands Beard : బంధాలు మంట కలిసిపోతున్నాయి. రాను రాను అక్క, చెల్లి, వదిన, అమ్మ ఇలాంటి బంధాలకి వాల్యూ…
Hit 3 Movie Review : నాని Nani హీరోగా నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'హిట్ 3: Hit…
Fridge Water : దారుణంగా ప్రతి ఒక్కరు కూడా వేసవిలో ఎండ తీవ్రతను తట్టుకోలేక దాహం వేయడంతో ఫ్రిడ్జ్ లోని…
This website uses cookies.