
major changes regarding ysrcp district presidents for big leaders
YCP : ఆంధ్రప్రదేశ్ లో 2024లో జరిగే ఎన్నికలకు ఇప్పటినుంచే ప్రిపేర్ అవుతున్నారు. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా సీఎం వైఎస్ జగన్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల పనితీరుపై క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వే మొదలైనట్లు సమాచారం. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశం కూడా ఉన్నట్లు ఇప్పటికే జగన్ చెప్పనట్లు తెలస్తోంది. అయితే గత ఎన్నికలలో చాలా మంది మంచి మెజార్టీతో గెలవడంతో మళ్లి వారిని పోటీ చేయించనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందుకే వారికి జగన్ నియోజకవర్గాల్లో మరింత కసరత్తు చేయాలని కోరినట్లు సమాచారం.అయితే ఇంకా ఎన్నికలకు రెండేళ్లు సమయం ఉన్నప్పటికీ ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా వైసీపీ కేడర్ ని రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే జగన్ ఉత్తరాంధ్రంలో పర్యటిస్తూ ప్రజల్లో ఉంటున్నారు. రీసెంట్ గా మంత్రి వర్గ విస్తరణ ఏర్పాటు చేసి కొత్తవారిని కూడా కేబినెట్ లోకి తీసుకున్నారు. అయితే తాజా మాజీ మంత్రులకు జిల్లాల బాధ్యతుల అప్పగిస్తారని పలు వార్తలు వచ్చినా ఇప్పటికైతే వైసీపీ అధినేత ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.అయితే పనితీరు బాగా లేని ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా పనితీరు మార్చుకుని సర్వేలో మార్కులు తెచ్చుకుంటే తమ సీటు ఖాయమని హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే గత ఎలక్షన్లలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వైసీపీ తరఫున పనిచేసి వైసీపీని అధికారంలోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం సీఎం జగన్ ప్రశాంత్ కిషోర్ ని పక్కన పెట్టి సోంత వ్యూహాలను రచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
YCP political surveys in ap before elections
జగన్ మూడేళ్ల అనుభవంతో ఏపీ ప్రజలకు ఏం కావాలో తేల్చే పనిలో ఉన్నారు. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసి మరో సారి అధికారాన్ని చేజిక్కించుకునేలా అధినేత ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.సంక్షేమ పథకాల అమలులో క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ బలంగా ఉందని, సీనియర్ నేతలతో చర్చించి జగన్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పక్కా ప్లాన్ తో వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి వ్యూహాలు అమలు చేసి అధికారంలోకి రానున్నారో వేచి చూడాల్సిందే…
Ranabaali Movie : టాలీవుడ్ Tollywood యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ Vijay Devarakonda మరోసారి తన సినిమా ఎంపికతో…
Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో మరోసారి 'రెడ్ బుక్' Red Book అంశం అధికార, ప్రతిపక్షాల…
Indiramma Houses : పేదలకు సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల…
Amaravati Capital : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత దశాబ్ద కాలంగా 'అమరావతి' ఒక ప్రధాన అంకంగా నిలిచింది. 2014లో విభజన…
Loan: లోన్ తీసుకోవాలంటే ముందుగా మంచి సిబిల్ స్కోర్ cibil score ఉండాలి ఆ తర్వాత బ్యాంకుల Banks చుట్టూ…
Tale of Two Loves : ఒడిశా రాష్ట్రానికి చెందిన 75 ఏళ్ల బాబు లోహర్ కథ నేటి కాలంలో…
Business Idea : ప్రస్తుత కాలంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, పెట్రోల్ పంప్ వ్యాపారం అనేది అత్యంత…
Bald Head : వివాహ బంధం అనేది కష్టసుఖాల్లో తోడుంటామనే ప్రమాణాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ చైనాలోని హెనాన్…
This website uses cookies.